అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులపాటు జరగనున్నాయి. అసెంబ్లీ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు సమావేశాలను ఈ నెల 30, 31, సెప్టెంబర్ 1న జరపనున్నారు. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపేందుకు ఒక రోజు అసెంబ్లీ, మండలి సమావేశం కావాలని ప్రభుత్వం తొలుత పేర్కొన్నప్పటికీ మరో రెండ్రోజులు కూడా సమావేశాలు జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాల తొలి రోజైన 30న జీఎస్టీ బిల్లుపై, 31న కొత్త జిల్లాల ఏర్పాటుపై, సెప్టెంబర్ 1న గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై ఉభయ సభలు చర్చిస్తాయని సమాచారం.