ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి.. తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తుండగానే నాలుగు ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. జీఎస్టీ బిల్లుతో పాటు అగ్రికల్చరల్, హార్టికల్చర్ రంగాల్లో ప్రైవేటు కాలేజీల బిల్లును ఆమోదించింది. హోటళ్లలో వ్యాన్ మినహాయింపు బిల్లును, డబుల్ రిజిస్ట్రేషన్లపై నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి ముందే చర్చ జరగాలని వైఎస్ఆర్‌సీపీ గట్టిగా పట్టుబట్టింది. శాసనసభ కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకుంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఈ ఆందోళన మధ్యే నాలుగు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.
నిరసన మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం
Published Thu, Sep 8 2016 2:58 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement