జీఎస్టీ గ్రేటే కానీ,.. మాకేం తెలియదు!! | SRK And Big B Say Cheers To GST Bill, But Agree That They Have No Clue About It | Sakshi
Sakshi News home page

జీఎస్టీ గ్రేటే కానీ,.. మాకేం తెలియదు!!

Published Thu, Aug 4 2016 2:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

జీఎస్టీ గ్రేటే కానీ,.. మాకేం తెలియదు!!

జీఎస్టీ గ్రేటే కానీ,.. మాకేం తెలియదు!!

భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన గొప్ప బిల్లు జీఎస్టీ... దేశమంతా ఒకే పన్ను ఉండేలా రూపొందిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును రాజ్యసభ బుధవారం ఆమోదించింది. అతిపెద్ద పన్నుల సంస్కరణగా భావిస్తున్న ఈ బిల్లుపై రాజకీయ నాయకులే కాదు.. చాలామంది ప్రముఖులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కానీ, 2007లో యూపీఏ ప్రభుత్వం తీర్చిదిద్దిన ఈ బిల్లు గురించి బాలీవుడ్‌ టాప్‌ హీరోలకు అసలేమీ ఏమీ తెలియదంట. వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ఓవైపు జీఎస్టీ బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని కీరిస్తూనే.. అబ్బే ఈ బిల్లు గురించి మాకేం తెలియదండి అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌, కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌.

'ఆర్థిక విషయాల గురించి నాకు పరిమిత జ్ఞానమే ఉంది. అయినప్పటికీ జీఎస్టీ బిల్లు దేశ బలోపేతానికి గొప్ప ముందడుగు. కాబట్టి అందరికీ అభినందనలు' అని షారుఖ్‌ ట్వీట్‌ చేయగా.. ఇటూ బిగ్‌ బీ కూడా తనకు ఆ బిల్లు గురించి ఏమీ తెలియదంటూ సెలవిచ్చాడు.

'జీఎస్టీ బిల్లు గురించి సుదీర్ఘంగా చర్చించి ఎట్టకేలకు ఆమోదించారు. ఈ బిల్లు ఏమిటో నాకు తెలియదు. కానీ అందరిలాగే ఎక్సైట్‌ అయ్యాను' అని బిగ్‌ బీ ట్వీటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement