కోటిమంది ఫాలోయర్లు! | Salman joins Shah Rukh, crosses 10 million followers on Twitter | Sakshi
Sakshi News home page

కోటిమంది ఫాలోయర్లు!

Published Sun, Jan 18 2015 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

కోటిమంది ఫాలోయర్లు!

కోటిమంది ఫాలోయర్లు!

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌ల తరువాత ఇప్పుడు ఆ వరుసలో సల్మాన్ ఖాన్ వచ్చి చేరారు. ఏమిటా వరస అంటారా? ట్విట్టర్‌లో తమను అనుసరిస్తున్నవారి సంఖ్య కోటికి చేరుకోవడం! హిందీ నటుల్లో ముందుగా అమితాబ్, ఆ పైన షారుఖ్ ఖాన్ ఆ ఘనతను అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఆ జాబితాలో చేరారు. ప్రస్తుతం కబీర్ ఖాన్ దర్శకత్వంలో కరీనా కపూర్‌తో కలసి ‘బజ్‌రంగీ భైజాన్’ హిందీ చిత్రంలో నటిస్తున్న సల్మాన్ ట్విట్టర్‌లో చాలా చురుకుగా ఉంటారు.
 
 ఆయనను అనుసరించే వీరాభిమానులకూ కొదవ లేదు. మామూలు జనం మాట్లాడుకొనే భాషలో, అప్పుడప్పుడు తన జీవిత తత్త్వాన్ని చెబుతూ సల్మాన్ చేసే ట్వీట్లు చాలా పాపులర్. ట్విట్టర్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండే సల్మాన్ తరచూ తన సినిమాల తాజావార్తలు, తన జీవిత విశేషాలను ఆ వేదిక ద్వారానే పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ‘బజ్‌రంగీ భైజాన్’ చిత్రంతో డేట్లు సర్దుబాటు కాకపోవడంతో, పాపులర్ టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ నుంచి సల్మాన్ ఆ మధ్య తప్పుకున్న సంగతి తెలిసిందే.
 
 అయినప్పటికీ, ఆ షోకు సరికొత్త హోస్ట్ అయిన ఫరా ఖాన్‌నూ, ఇతర పోటీదారులనూ ట్విట్టర్ ద్వారా అభినందిస్తూనే ఉన్నారు. ఇక, అమితాబ్, షారుఖ్‌లైతే సామాజికంగా క్రియాశీలంగా వ్యవహరిస్తూ, సినిమాల మొదలు సామాజిక - రాజకీయ అంశాల దాకా అన్నింటి గురించి ట్విట్టర్‌లో తమ భావాలను పంచుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement