సూపర్ స్టార్లు సైకిళ్లెక్కారు.. ఎందుకో తెలుసా? | Shah Rukh Khan, Salman Khan enjoy bike ride together | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్లు సైకిళ్లెక్కారు.. ఎందుకో తెలుసా?

Published Fri, Jul 1 2016 3:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

Shah Rukh Khan, Salman Khan enjoy bike ride together

బాలీవుడ్ లో టాప్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. కొంతకాలం కిందటి వరకు వీరి మధ్య మనస్పర్థలు ఉండేవి. కానీ ఇప్పుడు స్నేహితులయిపోయారు. జాన్ జిగ్రీ దోస్తులుగా ప్రతిచోటా తమ స్నేహాన్ని చాటుకుంటున్నారు. అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు.


తాజాగా ఈ సూపర్ స్టార్లు చెరో సైకిల్ ఎక్కి ఎంచక్కా షికారుకు  వెళ్లారు. ఎందుకో తెలుసా.. పర్యావరణానికి మేలు చేయడానికి.. వాహనాలకు బదులు సైకిల్ వినియోగించడం వల్ల కాలుష్యం తగ్గుతోంది. పర్యావరణానికి మేలు జరుగుతోంది. ఇదే విషయాన్ని తాజాగా షారుఖ్ తన ట్విట్టర్ పేజీలో తెలిపాడు. 'భాయ్.. భాయ్ కలిసి సైకిళ్లపై షికారు కెళ్లారు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. భాయ్ అంటాడు 'మైఖేల్ లాల్ సైకిల్ లాల్' అంటూ షారుఖ్ తమ ఫొటో పెట్టి ట్వీట్ చేశాడు.


కాగా, సల్మాన్ చేసిన 'రేప్ వ్యాఖ్యల' వివాదంపై షారుఖ్ స్పందించిన సంగతి తెలిసిందే. 'నా పరిస్థితి రేప్కు గురైన మహిళలా ఉంది' అన్న సల్మాన్.. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందా? అని మీడియా షారుక్ ఖాన్ను ప్రశ్నించగా..  'గత కొన్ని సంవత్సరాలుగా నేనే చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాను. అలాంటప్పుడు మరొకరి వ్యాఖ్యలను నేను ఎలా జడ్జ్ చేయగలను' అంటూ షారుఖ్ తప్పించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement