వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును ఆమోదం కోసం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒకట్రెండు మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలపడంతో ఏ ఇబ్బందీ లేకుండా బిల్లుసభ ఆమోదం పొందనుంది. నేడు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. గతేడాదే బిల్లును లోక్‌సభ ఆమోదించినా... రాజ్యసభలో కొన్ని సవరణలు చేయడంతో మళ్లీ దిగువసభలో ప్రవేశపెడుతున్నారు. జీఎస్టీకి కాంగ్రెస్ మద్దతిస్తుందని, నేడు సభకు అందరూ ఎంపీలు హాజరుకావాలంటూ విప్ జారీచేశామని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీజేపీతో పాటు పలు పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీచేశాయి.