ఆల్కహాల్ను జీఎస్టీ బిల్లు నుంచి మినహాయించినట్లే విద్యుత్ రంగాన్ని కూడా మినహాయించాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో కోరారు. జీఎస్టీ బిల్లులో పాల్గొన్న ఆయన కొన్ని సూచనలు చేశారు. జీఎస్టీ బిల్లు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆర్థిక నష్టాన్ని అయిదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందన్న ప్రతిపాదనను విజయ సాయిరెడ్డి స్వాగతించారు. అలాగే ఆరో సంవత్సరం నుంచి 50 శాతం, ఏడో సంవత్సరం నుంచి 25 శాతం నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.YSRCP MP vijaya sai reddy given few suggestions for GST BIll