
'వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'
ఢిల్లీ: 'నేను వేడుకుంటున్నా.. దయచేసి సహకరించండి'. ఇది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ కు చేసిన అభ్యర్థన . కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) బిల్లు మంగళవారం లోక్ సభకు వచ్చిన సందర్భంగా జైట్లీ ఈ మేరకు కాంగ్రెస్ కు విన్నవించారు. అప్పటివరకూ ఆ బిల్లుపై కాస్త వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ మెత్తబడింది. దీంతో పార్లమెంట్ లో జీఎస్టీ బిల్లుకు మూడింట రెండొంతల మెజార్టీ లభించి బిల్లు ఆమోదం పొందింది.
ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలైతే రాష్ట్రాలు ముందడుగు వేస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ మద్దతు తెలపడానికి కారణం ఇది తమ ప్రభుత్వ ఆలోచనేనని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ తెలిపారు.