జీఎస్టీ బిల్లును తాము ఎన్నడూ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి చిదంబరం తెలిపారు. బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వంలో జీఎస్టీ బిల్లును బీజేపీ వ్యతిరేకించిందన్నారు. సభలో ఏకాభిప్రాయంతోనే బిల్లు ఆమోదం పొందాలన్నారు. తమ అంగీకారం లేకుండా బిల్లును ఆమోదించుకోవాలని ఎన్డీయే సర్కార్ ప్రయత్నించి విఫలమైందన్నారు. మూడు, నాలుగు నెలల్లో ప్రభుత్వ వైఖరిలో మార్పు రావటం హర్షణీయమన్నారు. జీఎస్టీ బిల్లులో సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు.