ఎన్ని ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా మోదీ సర్కారు దిగి రాలేదు. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా మొత్తుకున్నా కేంద్రం కదలలేదు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై మళ్లీ పాత పాటే వినిపించింది. ఎంతో చేశాం, ఇంకా చేశామన్న పడికట్టు పదాలనే మళ్లీ వళ్లించింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై స్పష్టం మామీ ఇవ్వకుండా సమాధానం దాటవేసింది.