న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లులకు చేసిన 5 సవరణలతోపాటుగా చట్టంలోని మిగిలిన 4 నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 13వ సమావేశంలో.. జీఎస్టీ బిల్లులకు సంబంధించి లోక్‌సభ చేసిన సవరణలను ఆమోదించారు. జీఎస్టీకి సంబంధించిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్, వస్తువులు–సేవల సప్లై వాల్యుయేషన్, లెవీ విధింపుపై నిర్ణయం, మధ్యంతర నిబంధనలకు మండలి మౌలికంగా ఆమోదించారు.
సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్‌లు సంబంధింత అధికారి డిజిటల్ సంతకంతోనే జరగాలని, ఏకీకృత గుర్తింపు నెంబరును ఇవ్వటం, రద్దు చేయటానికి సంబంధించిన విధివిధానాల సవరణకూ ఓకే చెప్పింది. కొన్ని కేటగిరీల్లోని వ్యక్తులు ప్రతిఏటా రిటర్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదని జైట్లీ అన్నారు. తుది ముసాయిదాను రూపొందించాక ఇండస్ట్రీ ముందుంచి సలహాలు స్వీకరించాలని నిర్ణయించించారు.
సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఓకే
Published Sat, Apr 1 2017 3:46 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement
Advertisement