
రైతు కోసం నిమిషం కేటాయించలేరా?
బన్స్‌వారా: జీఎస్టీ కోసం పార్లమెంట్‌ను అర్ధరాత్రి సమావేశపర్చిన కేంద్ర ప్రభుత్వం.. రైతు సమస్యలపై చర్చకు ఒక్క నిమిషం కూడా కేటాయించలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. రాజస్తాన్‌లోని బన్స్‌వారాలో కిసాన్ ఆక్రోశ్ ర్యాలీని ఉద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. చిన్న వ్యాపారుల ప్రయోజనాల్ని విస్మరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం హడావుడిగా జీఎస్టీని అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. ‘ప్రపంచం, అమెరికా అధ్యక్షుడి ముందు గొప్ప కోసం జీఎస్టీ బిల్లును అర్ధరాత్రి అమల్లోకి తెచ్చారు. అయితే భారత్ రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల దేశం. అంతేకానీ అమెరికాది కాదు’ అని పేర్కొన్నారు.