యూసుఫ్‌గూడలో మంగళవారం ఓ ఆటో డ్రైవర్తో రాహుల్‌గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ కోసం రాజస్తాన్ తరహాలో పథకాన్ని వర్తింప జేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. సీఎం, మంత్రివర్గస్థాయిలో గిగ్ వర్కర్స్ ప్రతినిధుల బృందంతో సమావేశం ఏర్పాటు చేసి సామాజిక భద్రతతో కూడిన నిధిపై చర్చిస్తామని, తగిన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.
ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశం ఉందని, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు సాయం, సింగిల్ పర్మిట్ పాలసీ, పెండింగ్ చలాన్ 50 శాతం తగ్గింపుతో క్లియరెన్స్ లాంటి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జీహెచ్‌ఎంసీ పారిశు ధ్య కార్మికులు, గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్ ఆటో, క్యాబ్ డ్రైవర్లు)తో ఆయన ముఖాముఖి నిర్వహించారు. డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికుల సమస్య లు, దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా కార్మికులు తమ కష్టాలు ఆయనకు వివరించారు.
శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు
శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల కొద్దీ పనిచేసి సంపాదించినదంతా డీజిల్, పెట్రోల్‌కే సరిపోతోందని వాపోయారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటా యించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment