న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్ట్ మధ్య వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఈ నెల 29న భేటీ కానుంది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం జూలై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమై.. ఆగస్ట్ 13 వరకూ కొనసాగనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
18 నుంచి పార్లమెంట్ భేటీ!
Published Thu, Jun 23 2016 2:16 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement
Advertisement