ఒకే దేశం..ఒకే పన్ను విధానం: జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీఎస్టీ బిల్లుపై ఆయన మాట్లాడుతూ బిల్లుపై విస్తృత సంప్రదింపులు జరిపామన్నారు. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు మేలు జరుగుతుందని జైట్లీ తెలిపారు. బిల్లుపై ఎంపిక కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
ఒకే దేశం..ఒకే పన్ను విధానం ఉండాలని, దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లు జీఎస్టీయేనని జైట్లీ అభివర్ణించారు. జీఎస్టీ బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యం అవుతాయన్నారు. ఈ బిల్లుకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన సూచించారు. జీఎస్‌టీ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.