జీఎస్టీ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది
ముంబై: భారతదేశంలోని వ్యాపార దిగ్గజాలు జీఎస్టీ బిల్లు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ గా పేర్కొంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లు ఆమోదంకోసం వేచి చూస్తున్నాయి. వివిధ పరోక్ష పన్నులు, పన్నుశాతాల తొలగింపు, ఒకే పన్ను ఒకే దేశం పద్ధతిద్వారా పారదర్శకత నెలకొంటుందని భావిస్తున్నాయి. ఇది ఆర్థికవృద్ధికి మంచి ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నాయి. బుధవారం రాజ్యసభలో వాడి వేడి చర్చల నేపథ్యంలో ప్రముఖ కంపెనీల పెద్దలు స్పందించారు. ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు.
భారీ ఉత్పాదకతో పాటు లక్షల ఉద్యోగాలకు సృష్టించే సామర్ధ్యం జీఎస్టీ బిల్లుకు ఉందని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ట్విట్ చేశారు. జీఎస్ టీ బిల్లులేని భారత ఆర్థిక వ్యవస్థ లేదని ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాఅన్నారు.
జీఎస్టీ లేకుండా ఆర్థిక వ్యవస్థ నియంత్రణ సాద్యంకాదని లేకుండా కోటక్ ఆటో మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ట్విట్ చేశారు. ఈ బిల్లు పాస్ కావాలని ప్రార్ధిస్తున్నాన్నారు. బీజేపీ పాపులర్ స్లోగన్ అచ్చే దిన్ తీసుకొచ్చే సత్తా ఉందన్నారు.
సంస్కరణల ప్రక్రియలో జీఎస్ టీ బిల్లు ఒక "మైలురాయి" లాంటిదని జెఎస్ డబ్ల్యు స్టీల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. దీనికి అన్ని పార్టీలు ప్రభుత్వానికి అభినందనలు తెలపాలన్నారు. సాధారణ ప్రజలకు జీఎస్టీ ఉపయోగపడుతుందని బయోకాన్ ఎండీ కిరణ మజుందార్ షా ఇటీవల తన ట్విట్ లో పేర్కొన్నారు.