
జీఎస్టీ బిల్లు.. ఇక చట్టం!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభలతో పాటు ఇప్పటికే 16 రాష్ట్రాలు కూడా ఆమోదించడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది.
తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనిపై సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టరూపం దాల్చినట్లయింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో.. కనీసం సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లే, 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఆగస్టు నెలలోనే లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లును ఆమోదించాయి.