ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలని చూస్తోందన్నారు.