బొగ్గు.. బుగ్గి
ఓసీపీల్లో కాలుతున్న కోల్
సింగరేణికి రూ.లక్షల్లో నష్టం
ఆర్జీ-1 ఏరియూ పరిధి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పనిస్థలాల నుంచి వెలికితీసిన బొగ్గును రెండు నిల్వ కేంద్రాలలో డంప్ చేశా రు. గాలితో జరిగే రసాయన చర్య వల్ల బొగ్గుకు మంటలు అంటుకుని బూడిదవుతోంది. ప్రాజె క్టు నుంచి ప్రతీ రోజు 13వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి నిల్వ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి సీహెచ్‌పీలకు లారీల ద్వారా రవాణా చేస్తారు. అయితే ఓసీపీ క్వారీలలో ఊటగా వచ్చే నీటిని మోటర్ల ద్వారా పైకి తీసుకువచ్చి కాలుతున్న బొగ్గుపై చల్లించే ప్రయత్నం చేస్తు న్నారు. నీళ్లు చల్లిన సమయం వరకే పొగలు రాకుండా ఉండి ఆ తర్వాత బొగ్గు కాలుతూనే ఉంటుంది. ఇలా రోజుకు సుమారు 15 టన్నుల బొగ్గు కాలి బూడిదవుతున్నట్లు అంచనా వేశా రు. ఇలా ఒక్క ఓసీపీ వద్దే రోజుకు రూ.30వేల చొప్పున నెలకు రూ.9లక్షల వరకు సింగరేణికి నష్టం కలుగుతోంది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులోని ఊటనీరు డోజర్లు, డంపర్లు నడిచే మార్గంలో దుమ్ము లేవకుండా చల్లడానికే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో కాలుతున్న బొగ్గుపై నీటిని చల్లించేందుకు యూజమాన్యం గోదావరినది నుంచి నేరుగా పైప్‌లైన్ వేసి నీటిని తీసుకువచ్చే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
చాలా ఓసీల్లో ఇదే పరిస్థితి..
ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కావడం తో యూజమాన్యం ఉత్పత్తిపై దృష్టి సారించిం ది. దీంతో రోజు వారీ లక్ష్యాని కన్నా అధికంగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అందుకు అనుగుణంగా డంప్ యూర్డుల నుంచి రవాణా కాకపోవడంతో సింగరేణి కంపెనీ వ్యాప్తంగా చాలా ఓసీపీల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. బెల్లంపల్లి రీజియన్ పరిధి ఖైరిగూడ, డోర్లి-1, 2 తోపాటు పలు ప్రాజెక్టుల ప్రాంతాల్లో బొగ్గు కాలుతున్న ట్లు తెలుస్తోంది. పేరుకుపోతున్న నిల్వలుబొగ్గును ముందుగా సీహెచ్‌పీలకు పంపించి అక్కడి నుంచి సిమెంట్, విద్యుత్ తదితర పరిశ్రమలకు రైలు వ్యాగన్ల ద్వారా తరలిస్తారు. విద్యుత్, సిమెంట్ పరిశ్రమలు సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవడానికి జాప్యం చేస్తుండడంతో బొగ్గు నిల్వలు పేరుకుపోరుు అగ్నికి ఆహుతవుతున్నారుు. రోడ్డు మార్గం ద్వారా కూడా బొగ్గు సరఫరా చేయడానికి యాజమాన్యం ఇటీవల నిర్ణయం తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.