దేశాన్ని తప్పుదారి పట్టించొద్దు!
- భూ బిల్లుపై సోనియా లేఖకు గడ్కారీ సమాధానం
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లు రైతు వ్యతిరేక మంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఘాటుగా రాసిన లేఖకు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సోమవారం అంతే తీవ్రంగా సమాధానమిచ్చారు. దేశాన్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని సోని యాపై విమర్శలు సంధించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమేనన్నారు. యూపీఏ సర్కా రు తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ఒక్క ఎకరం భూమినీ సేకరించడం సా ధ్యం కాలేదన్నారు. అందులోని నిబంధనల కారణంగా ప్రాజెక్టులు పూర్తికాక, తమ భూములకు సాగునీరందక, రైతులంతా వర్షాలకోసం ఎదురుచూసే పరిస్థితులే నేటికీ నెలకొని ఉన్నాయని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగిత, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆక్షేపించారు.