కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావనే కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నట్టు కన్పిస్తున్న వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా సమాధానమిస్తున్నారు. మరి కొందరైతే వాహనాలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలుసుకోవడానికి వారి ఊహకు పని చెబుతున్నారు. ఈ వంతెన.. విమానాలు, పడవలను అదృశ్యం చేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతంలా ఉందని, హ్యారీపోటర్ సినిమాలోని మాయా విశ్వం మాదిరిగా ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను గ్రాఫిక్స్‌లో అలా క్రియేట్ చేశారా లేదా అనేది తెలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment