- హనుమాన్ పీఠాధిపతి
- రాములు స్వామి
నదుల ప్రక్షాళన చేపట్టాలి
Published Wed, Jul 20 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
ఏటూరునాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని కృష్ణ, గోదావరి నదుల ప్రక్షాళన చేపట్టాలని హనుమాన్ పీఠాధిపతి గాదెపాక రాములు స్వామి అన్నారు. తెలంగాణలోని గోదావరి పుష్కరఘాట్ల సందర్శనలో భాగంగా మంగళవారం మండలంలోని రామన్నగూడెం ఘాట్ వద్ద గోదావరి నదికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదుల్లో మలినాలను తొలగించి, మానవ మనగడకు ఆరోగ్య ప్రదాతలుగా బాధ్యత వహించాలన్నారు. చాలా మంది ఘాట్ల వద్ద మలినాలను వదిలేయడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. నదుల పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబక్‌లో జన్మించి 1465 కిలోమీటర్ల ప్రయాణంతో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, పర్ణశాల, భద్రాచలం, రాజమండ్రి, ధవళేశ్వరంలో ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తోందన్నారు. పర్ణశాల, భద్రాచలం, రామన్నగూడెం ఘాట్‌లను, బుధవారం నుంచి కాళ్లేశ్వరం, ధర్మపురి, బాసరను సందర్శిస్తానని వెల్లడించారు. దుగ్గొండి మండలం ముద్దునూరుకు చెందిన తాను పవిత్ర నదులను శుద్ధి చేసి అపవిత్రం కాకుండా ఉండేందుకు ఈనెల 20 నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో మౌనదీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.
Advertisement