ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి ముందు ముంబైలోని నారిమన్ మైదానంలో గల ఎన్‌సీపీఏలాన్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
రతన్ టాటా పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీలోగల విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల పద్ధతి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.
There’s a Hindu pujari, Christian priest, Muslim Imam and a Sikh sant standing behind. Sanghis may not like this, but this is truly secular …..!!
Rest in peace Sir Ratan Tata ….. 🙏 pic.twitter.com/DjiYNOPR7C— Mayank Saxena (@mayank_sxn) October 10, 2024
పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిలో అంత్యక్రియల సంప్రదాయం మూడు వేల సంవత్సరాల నాటిది. పార్సీలు అనుసరించే జొరాస్ట్రియనిజంలో మనిషి మృతి చెందాక ఆ మృతదేహాన్ని రాబందులు తినేందుకు అనువుగా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి.
గతంలో అంటే 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్సీ సమాజంవారు అనుసరించే అంత్యక్రియల ఆచారాలను వివిధ ప్రభుత్వాలు నిషేధించాయి.
Comments
Please login to add a commentAdd a comment