ప్రమాదవశాత్తు నదిలోపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
శ్రీకాకుళం: ప్రమాదవశాత్తు నదిలోపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని మహేంద్రతనయ నది కాలి వంతెన పై నుంచి జారిపడ్డాడు. బాధితుడి ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(పాతపట్నం)