pathapatnam
-
ఆయనకు టికెట్ ఇస్తే నేనే ఓడిస్తా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ నాలుగు స్తంభాలాట ఆడుతోంది. తనకు టికెట్ ఖాయమైపోయిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రచారం చేస్తుండగా.. ఆయనకు టికెట్ ఇస్తే తానే ఓడిస్తానని మామిడి గోవిందరావు హెచ్చరిస్తున్నారు. ఈ గొడవతోనే ఆ పార్టీకి తలనోప్పి కడుతుంటే ఆ పార్టీ పాత నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు తాజాగా తెరపైకి వచ్చి తానూ ఇండిపెండెంట్‌గా అయినా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఈ జంఝాటం మధ్య జనసేన ఇన్చార్జి గేదెల చైతన్య తనకు కూడా సీటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులతో పాతపట్నంలో టీడీపీ రాజకీయం పతనావస్థకు చేరుకుంది. బలంగా వైఎస్సార్సీపీ.. పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1200కోట్లకు పైగా సంక్షేమ పథకా లు, రూ.800కోట్లకు పైగా నాన్ డీబీటీ పథకాలు అందించడంతో పాటు రూ. వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దానికి తోడు వంశధార నిర్వాసితులందరికీ చక్కగా పరిహారం అందజేసింది. దీంతో వైఎస్సార్సీపీ చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన తమలో తాము కొట్టుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే పని పెట్టుకున్నాయి. కానీ సమన్వయంలోపం కారణంగా ఆ పని కూడా చేయలేక చతికిలపడుతున్నారు. అంతటా అయోమయం.. టీడీపీకి అలవాటైన డబుల్ గేమ్ పాతపట్నంలో వికటించే పరిస్థితి కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమ ణ పార్టీ ఫిరాయించి టీడీపీకి వెళ్లడంతో ఆ పారీ్టలో ముసలం పుట్టింది. ఆయన అప్పటికే వంశధార నిర్వాసితుల పరిహారం, ఇసుక, ఇతరత్రా ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోట్ల రూపాయల కోసమే కలమట పార్టీ మారారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కలమట ఘోరంగా ఓడిపోయారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఇస్తే ఓడించి తీరుమతామని మరో నేత మామిడి గోవిందరావు అండ్ కో బాహాటంగానే చెబుతోంది. కాకపోతే, కలమట వల్ల ఎంత లబ్ధిపొందారో.. ఏ రకంగా ప్రయోజనం కలిగిందో తెలీదు గానీ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఫ్యామిలీ మాత్రం కలమటకు అండగా నిలుస్తోంది. వారి అండదండలే తనకు ఆశీస్సులని, అవే సీటు తెచ్చి పెడతాయని కలమట కొండంత ఆశతో ఉన్నారు. అందుకు తగ్గ సంకేతాలు వస్తున్నాయి. మామిడి గోవిందరావు తనకు పోటీ ఏంటని, వాడుకుని వదిలేస్తామని కలమట బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. టిక్కెట్ ఇవ్వకుంటే.. టీడీపీలో మరో కీలక నేతగా ఎదిగిన మామిడి గోవిందరావు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి సీటు తనకే వస్తుందని చెబుతున్నారు. తర చూ చంద్రబాబును, లోకేష్ ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతి సారి రూ. లక్షల్లో పార్టీకి చదివించుకుంటున్నారు. ఇలా ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. కాకపోతే, ఆయన ఆశలను కింజరాపు ఫ్యామిలీ అడియాశలు చేస్తోంది. మామిడి గోవింద్‌ను వాడుకుంటామని, ఖర్చు పెట్టిస్తామని, అంతమాత్రాన టిక్కెట్ ఇచ్చేస్తామా అని ఒకానొక సందర్భంలో అచ్చెన్నాయుడు బహిరంగంగా చెప్పేశారు. అయినప్పటికీ మామిడి.. లోకేష్ తదితరులకు టచ్‌లోకి వెళ్లి, కింజరాపు ఫ్యామిలీ వ్యతిరేక గ్రూపులో రాజకీయాలు నెరుపుతున్నారు. కానీ ఈయనకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదు. ఒకవేళ తనకు కాకుండా కలమటకు టిక్కెట్ ఇస్తే నియోజకవర్గమంతా తిరిగి ఓడిస్తానని చెప్పకనే చెబుతున్నారు. కాకపోతే ఇటీవల ఆయనలో స్పీడు తగ్గింది. కార్లు ఇచ్చి డబ్బులిచ్చి తిప్పించడం వంటి పనులు కూడా తగ్గించేశారు. కలవరం.. ఇదంతా ఓ వైపు సాగుతుండగా.. ఒకప్పుడు టీడీపీలో కొనసాగి, తర్వాత స్తబ్దతగా ఉన్న సిరిపురంతేజేశ్వరరావు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడిది టీడీపీని కలవరపెడుతోంది. మరో మిత్రపక్షమైన జనసేన పరిస్థితి మరోలా ఉంది. తమకే టిక్కెట్ వస్తుందని ఆశపడుతూనే కలమటతో కలిసి పనిచేయలేమంటూ తమ వైఖరి ద్వారా తెలియజే స్తోంది. ఆ పార్టీ ఇన్చార్జి గేదెల చైతన్య తొలుత కొన్ని సార్లు కలమట వెంకటరమణతో కలిసి వేదిక లు పంచుకున్నా ఆ తర్వాత దూరం పాటిస్తున్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో కలిసి పనిచేయలేమని జనసేన కేడర్ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. -
‘ఏపీ ప్రజల ఆకాంక్షలు సీఎం జగన్ నెరవేర్చారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. పాతపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో వైస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, వి.కళావతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజల ఆకాంక్షలు తీర్చారు. వంశధార నిర్వాసితులకు 216 కోట్లు అదనపు పరిహారం ఇచ్చారు. హిర మండలం వద్ద 176 కోట్ల తో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. పాడు పడిన పాఠశాలలు బాగు చేసి మంచి బడులు గా తీర్చి దిద్దారు. కొత్తూరు లో 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం కిడ్నీ రోగులకు నెఫ్రాలజిస్టులను కనీసం నియమించ లేకపోయింది. జగనన్న ఏకంగా కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ నిర్మించారు’’ అని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండి.. జన్మభూమి కమిటీల ద్వారా గత ప్రభుత్వం ప్రజల సొమ్ము దోపిడీ చేసిది. అవినీతి లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2లక్షల 45 వేల కోట్ల రూపాయిలు ప్రజల ఖాతా ల్లో జమ చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. సంక్షేమ పథకాలు గౌరవంగా ఇస్తున్న విషయం గమనించండి. చంద్ర బాబు అభివృద్ధి లేదంటున్నాడు. ప్రతి గ్రామంలో సచివాలయం, ఆరోగ్య కేంద్రం నిర్మించడం అభివృద్ధి కాదా?. ప్రజల అవసరాలు వైద్యం, విద్య, ఉపాధి కల్పించకుండా రోడ్డులు వేస్తే అభివృద్ధి జరిగినట్టా?. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు అవే ఇస్తానంటున్నాడు. మూడు సార్లు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. ఏమి చేశారు?. వైస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో సంస్కరణలు తెచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేసింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే పేదలు కోటీశ్వర్లు అయ్యారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే పనులు చేసింది ఈ ప్రభుత్వం -మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారు.. సీఎం జగన్ నాలుగున్నరేళ్లు పాలనలో ఎంతో మార్పు తెచ్చారు. సచివాలయాల ద్వారా అవినీతి లేకుండా పథకాలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో ఏమి చేశామో సచివాలయం వద్ద దాపరికం లేకుండా ధైర్యంగా బోర్డు పెట్టాం. ఈ బోర్డుల్లో ఎక్కడైనా అబద్ధం ఉంటే నిలదీయండి. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయడం తప్పు అని చంద్రబాబు అంటున్నాడు. అప్పట్లో చంద్రబాబు అలీబాబా 40 దొంగల్లా దోచుకొని ప్రజల సొమ్ము తిన్నారు. పేద పిల్లాడికి మంచి యూనిఫార్మ్, స్కూల్ బ్యాగ్, బూట్లు కొని ఇస్తే తప్పా. తమ బిడ్డ నీట్‌గా తయారై స్కూల్‌కి వెళ్తుంటే తల్లి కళ్లల్లో సంతోషం చూడటం అభివృద్ధి కాదా? -స్పీకర్ తమ్మినేని సీతారాం -
ఏపీలో దిగ్విజయంగా కొనసాగుతున్న సామాజిక సాధికార యాత్ర
-
శ్రీకాకుళం: భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. పాత పట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. #WATCH | Andhra Pradesh | Fire breaks out in a shopping mall in Pathapatnam, of Srikakulam district due to an electrical short circuit. Fire engines have reached the spot to put out the fire. Details awaited. pic.twitter.com/dx7GhFJNzr — ANI (@ANI) August 30, 2023 -
Fact Check: ‘గోడ’ చాటు కుట్రలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల తప్పుడు ప్రచారాలకు తెరతీస్తున్న టీడీపీ నేతలు గోడమీద పిల్లుల్లా వ్యవహరిస్తూ సామాజిక మాధ్యమాల్లో బురద చల్లుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను సైతం వారు వదలడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉదంతమే దీనికి తాజా ఉదాహరణ. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల కిత్రం తీసుకున్న నిర్ణయం మేరకు స్థానిక నీలమణి దుర్గమ్మ వారి ఆలయ ప్రహరీ గోడ, ఆర్చిని అధికారులు శనివారం స్వల్పంగా తొలగించారు. దీనిపై దుష్ప్రచారం చేస్తూ లోకేష్ సహా టీడీపీ నేతలు వైషమ్యాలను రగిల్చేందుకు సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టారు. (చదవండి: రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు) ధ్వజస్థంభం, మండపానికి నష్టం వాటిల్లకుండా.. వాస్తవానికి భూ సమీకరణ ప్రక్రియలో భాగంగా ఆలయ ధ్వజ స్థంభం, మండపం లాంటివి సైతం తొలగించాల్సి ఉంది. ప్రస్తుతం 30 సెంట్ల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణం ఉండగా తొమ్మిది సెంట్ల మేర సమీకరణలో పోవాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నీలమణి దుర్గమ్మవారి ఆలయం ధ్వజస్థంభం, మండపం లాంటి వాటికి నష్టం వాటిల్లకుండా స్థానిక ఎమ్మెల్యే ఆరేడు నెలలుగా అధికారులతో పలు సంప్రందింపులు జరిపినట్లు దేవదాయ శాఖ వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్ ప్రక్కగా నిర్మించాల్సిన అప్రోచ్ రోడ్డు డిజైను మార్చేందుకు సైతం స్థానిక ఎమ్మెల్యే కేంద్ర అధికారులను సైతం ఒప్పించారు. (చదవండి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపులు) దీంతో కేవలం ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం అర్చిని రెండు అడుగుల మేర తొలగించేందుకు మాత్రమే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది సెంట్లకు బదులుగా ఇప్పుడు కేవలం అర సెంటు ఆలయ భూమిని మాత్రమే ఫ్లైఓవర్ నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. తొలగించిన గోడ స్థానంలో కేవలం మూడు అడుగులు మాత్రమే ఆలయం లోపలికి జరిపి కొత్తగా ప్రహారీ గోడ, ముఖ ద్వారం ఆర్చిని సంబంధిత కాంట్రాక్టరు ఆధ్వర్యంలోనే నిర్మించేలా ఒప్పందం జరిగింది. భూ సమీకరణ పరిహారం రూ.1.40 కోట్లు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 2019 ఆగస్టు 28వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రకారం గతేడాది అక్టోబరులో ఆలయానికి రూ. 1,40,57,404 పరిహారాన్ని మంజూరు చేశారు. జిల్లా స్పెషల్ గ్రేడ్ కలెక్టర్, స్థానిక తహసీల్దార్, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఈనెల 22వ తేదీన ఆలయాన్ని సందర్శించి ఎక్కువ నష్టం వాటిల్లకుండా తొలగింపులు పూర్తయ్యేలా మార్కింగ్‌లు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక తహసీల్దార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆర్ అండ్ బీ డీఈఈ, సమక్షంలో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దసరా ఉత్సవాల కోసం వాయిదా ఫ్ల్రై ఓవర్ నిర్మాణంలో భాగంగా మూడు నెలల కిత్రమే ప్రహారీ గోడ తొలగింపు చేపట్టాలని కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఆలయంలో దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు వాయిదా వేసినట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయంలో దసరా ఉత్సవాల పూర్తయిన తర్వాతే తొలగింపు పనులు చేపట్టామని, వెంటనే కొత్త ప్రహారీ గోడ, ఆర్చి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్టు వివరించారు. బూతులు బెడిసికొట్టడంతో.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో బూతులు మాట్లాడించి ప్రజల మధ్య వైషమ్యాలను రగిల్చే ఎత్తుగడ బెడిసికొట్టడంతో తాజా ఘటనను ఆ పార్టీ నేతలు ఎంచుకున్నారు. ‘రెండున్నరేళ్ల పాలనలో హిందూధర్మం మంటగలిసింది. దేవుళ్లకి తీరని అపచారం తలపెట్టారు’ అంటూ లోకేష్ మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు. ఫ్యాక్ట్ చెక్‌తో వాస్తవాలు వెలుగులోకి.. ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రభుత్వం బయటపెట్టింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియా పోస్టులతో పాటు స్థానిక ఆలయ ఈవో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను జతపరిచి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం మీడియాకు వాస్తవాలను వెల్లడించింది. -
పాతపట్నంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు
-
కన్నవారిని కలిపిన ఫేస్బుక్
పాతపట్నం (శ్రీకాకుళం): నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది. కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు. ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్‌లో జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది. -
అమ్మవు నీవే అఖిల జగాలకు..
అమ్మలగన్న అమ్మ.. ముగురమ్మల మూలపటమ్మ కొలువుదీరింది. దేవీ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఊరిలో ప్రతి వాడలో అమ్మవారిని నెలకొల్పారు. పాలకొండలోని కోటదుర్గమ్మను దర్శించేందుకు తొలి రోజే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంత్రులు కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ దర్శించిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే కళావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాలకొండ కోటదుర్గమ్మ, పాతపట్నం నీలమణిదుర్గ, రాజాం నవదుర్గమ్మ, ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మరోవైపు గ్రామాల్లోనూ ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి దేవీ విగ్రహాలను ప్రతిష్టించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేలా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. – సాక్షి నెట్వర్క్ సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం) : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతపట్నం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదివారం తెల్లవారు జామున నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలిరోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్.కుమారస్వామి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరుణించమ్మా కోటదుర్గమ్మ కోటదుర్గమ్మ.. కరుణించు మాయమ్మ అన్న నామస్మరణతో పాలకొండ పట్టణం మారుమోగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున నాలుగు గంటలకు స్థానిక భక్తులు అమ్మవారి మాలధారణ కార్యక్రమంతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 సమయంలో మూహూర్తపురాటను అర్చకులు దార్లపూడి లక్ష్మిప్రసాదశర్శ వేయించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తొలిపూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పోటెత్తిన భక్తజనం.... ఏడాదిలో ఒక్కసారి అమ్మ నిజరూపదర్శనం చేసుకుంటే జీవితకాల పుణ్యం చేకూరుతుందన్న నమ్మకంతో భక్తులు దేవస్థానానికి పోటెత్తారు. తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈవో టి.వాసుదేవరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఛి వారాహి అమ్మవారికి విశేష పూజలు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారిని వారాహి అమ్మవారిగా అలంకరించారు. ముందుగా అర్చకులు గణపతి పూజతో ప్రారంభించి ప్రత్యేక అర్చనలు చేశారు. మహిళలు కుంకమ పూజలు చేశారు. పూజలందుకుంటున్నవారాహి అమ్మవారు శ్రీచక్రపురంలో ప్రత్యేక పూజలు ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కొంచాలకూర్మయ్యపేటలోని శ్రీచక్రపురంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కొంచాలకూర్మయ్యపేటలోని శ్రీచక్రపురంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగిరికటకంలో దసరా సరదా జలుమూరు: దసరా ఉత్సవాలు సంసృతీ సంప్రదాయాలకు ప్రతీకలని నగిరికటకం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం పైల సూర్యనారాయణ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం పాఠశాల విద్యార్థులతో సంప్రదాయ వస్త్రధారణ, ప్రత్యేక అలంకరణలతో ప్రదర్శన చేయించారు. వీధివీధికీ వెళ్తూ ‘దసరాకు వచ్చాము విస సలు వద్దు..’ అంటూ పాటలు పాడారు. వెదురు కర్రతో బాణాలు చేసి పువ్వులు,పత్రితో కోలాటాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.నీలవేణి, ఎం.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. శైలపుత్రికగా స్వేచ్ఛావతి అమ్మవారు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు లక్ష్మికాంత్పాఢీ ఆధ్వర్యంలో స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. దేవీ నవరాత్రి పూజ మండపంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, పలువురు భక్తులు సామూహిక దీపారాధన కార్యక్రమంలను నిర్వహించారు. దేవీ నవరాత్రులు ప్రారంభంలో భాగంగా తొలిరోజు అమ్మవారు శైలపుత్రికగా భక్తులకు దర్శనమిచ్చారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మాలధారణ నరసన్నపేట: స్థానిక పైడితల్లి ఆలయం వద్ద ఆదివారం దేవీ మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. 56 మంది భక్తులు భవానీ మాల ధరించారు. పైడితల్లి ఆలయ అర్చకులు లకు‡్ష్మడు ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజుల మాలధారణ చేసిన అనంతరం విజయవాడ దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటామని నిర్వాహక కమిటీ ప్రతినిధి గూర్జా రమణ తెలిపారు. అంబరాన్నంటిన సంబరాలు పాలకొండ రూరల్: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని పాలకొండ పట్టణంలోని చిన్న, పెద్ద గొల్ల వీధులకు చెందిన ప్రజలు సామూహిక సంబరాలు చేపట్టారు. ఆదివారం సాయింత్రం పెద్ద ఎత్తున మహిళలు æముర్రాటలతో ముందుకు సాగారు. తొలుత ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మను దర్శించుకుని అక్కడి నుంచి పాలకొండ– వీరఘట్టం రహదారిలోని గారమ్మ వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు. నవదుర్గా నమోస్తుతే..! రాజాం : రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రత్యేక పూజలు చేసి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఈఓ శ్యామలరావు, అర్చకులు వేమకోటి రవికిరణ్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం జ్ఞాన సరస్వతీ ఆలయంలో పూజలు చేశారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేయాలని దేవదాయశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం మండలం కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు. యూత్ కన్వీనర్ వంజరాపు విజయ్‌కుమార్, గొర్లె బ్రదర్స్, పారంకోటి సుధ, ఆసపు సూర్యం తదితరులు పాల్గొన్నారు. నవదుర్గకు ప్రత్యేక పూజలు రాజాం సిటీ: స్థానిక నవదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తిని మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ట్రస్టీ వానపల్లి నర్సింగరావు, పర్యవేక్షకులు కూరాడ వెంకటరావు, భక్తులు పాల్గొన్నారు. మంత్రి కృష్ణదాస్‌కు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఎమ్మెల్యే కళావతి అమ్మవారి సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యరనారాయణ, ఝాన్సీ దంపతులు, రోడ్లు భవనాల శాఖ మంత్రి దర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు మజ్జి శ్రీని వాసరావు, తమ్మినేని చిరంజీవినాగ్ తదితరులు కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, దేవదాయశాఖ అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి జ్ఞాపికలు అందించారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి పాలవలస విక్రాంత్, ఆర్డీవో టి.వి.ఎస్.కుమార్, డీఎస్పీ పి.రారాజు ప్రసాద్, తహసీల్దార్ జల్లేపల్లి రామారావు, నగర కమిషనర్ వై.లిల్లీపుష్పనాథంతోపాటు ఉత్సవకమిటీ సభ్యులు, ఇతర జిల్లాకు చెందిన అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. భారీ బందోబస్తు... వేలాదిమంది భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ ఆదాం నేతృత్వంలో పాలకొండ, రేగిడి, సంతకవిటి, వీరఘట్టం, ఎస్ఐలు, సిబ్బందితోపాటు పలు కళాశాల సీపీవోలు స్వచ్ఛందంగా సేవలుందించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. -
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..
సాక్షి, ఎల్.ఎన్.పేట (శ్రీకాకుళం): పాలవలస రాజశేఖరం కుమార్తెగా రెడ్డి శాంతి జిల్లా ప్రజలకు సుపరిచితం. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై, వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారి అభిమానాన్ని పొందారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. విరామ సమయంలో తన మససులోని మాటలను ‘సాక్షి’తో పంచుకున్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్నారు. సాక్షి: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు? రెడ్డి శాంతి: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరిపోయారు. వైఎస్సార్ కుటుంబాన్ని, వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్మి ఆయనకు ఓట్లు వేసిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని జగన్మోహన్రెడ్డి నన్ను నియోజకవర్గానికి పంపించారు. 2016 మే నెలలో ఇక్కడ అడుగు పెట్టాను. అప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తూ వారి ఆదరాభిమానాన్ని పొందాను. ఇక్కడి వారు నన్ను వారి కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకుని ఆదరించారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి చెందాను. పాలవలస రాజశేఖరం కూతురిగా నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజలకు నేను సుపరిచితురాలినే. సాక్షి: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు? రెడ్డి శాంతి: 2016 నుంచి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రెండు, మూడు సార్లు వెళ్లి అక్కడి ప్రజలతో కూర్చోని గ్రామాల్లోని ప్రధాన సమస్యలు వారిని అడిగి తెలుసుకున్నాను. వంశధార నిర్వాసితులకు 2013 ఆర్ఆర్ చట్టం, 2017 వరకు యూత్ ప్యాకేజీ వర్తింప చేసి న్యాయం చేస్తాం. అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటాం. మెళియాపుట్టి ఆఫ్‌షోర్ రిజర్వాయర్ బాధితులకు అండగా ఉంటాం. గిరిజన గ్రామాలను వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల్లో వంశధార నదికి కరకట్టలు నిర్మిస్తాం. బాలికల జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. పాతపట్నం, కొత్తూరు సీహెచ్‌సీల్లో సదుపాయాలు మెరుగుపర్చుతాం. వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టడం ద్వారా ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తాం. కల్లట, జిల్లేడుపేట, కోరసవాడ, కాగువాడ గ్రామస్తుల వంతెన కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వంతెన నిర్మాణానికి కృషిచేస్తాను. సాక్షి: మీ విజయానికి వ్యూహాలు ఏమిటి? రెడ్డి శాంతి: ప్రత్యేక వ్యూహాలు అంటూ ఏమీ లేవు. ఫిరాయింపు ఎమ్మెల్యే అక్రమాలు, టీడీపీ వైఫల్యాలే మా విజయానికి దోహదపడతాయి. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఎమ్మెల్యే కలమట గంగలో కలిపేశారు. ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన ఎమ్మెల్యే ఇసుక అక్రమ వ్యాపారం, ప్రభుత్వ భూములు కబ్జాపై దృష్టిసారించారు. అందుకే పార్టీ ఫిరాయించారు. టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు పోతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రతీ కుటుంబానికి అందజేస్తాం. సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? రెడ్డి శాంతి: నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, వంశధార నిర్వాసితులు ఉన్నారు. వారికి పరిహారం అందించి న్యాయం చేయాల్సిన పాలకులు కట్టుబట్టలతో గ్రామాల నుంచి గెంటేశారు. పంట కోతకొచ్చిందని, సంక్రాంతి పండగను వారి స్వగ్రామాల్లో చేసుకుని వెళ్లిపోతామని ఎంత బతిమాలినా వినకుండా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పోలీసులతో భయపెట్టి, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి బలవంతంగా బయటకు పంపించారు. ఆ సంఘటన నన్న ఎంతగానో కలచివేసింది. సమస్యను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాను. ఆయన హిరంమడలం వచ్చి బహిరంగ సభ నిర్వహించి నిర్వాసితులకు అండగా ఉంటానని, 2013 చట్టం వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులపై అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తామన్నారు. 2017 వరకు యూత్ ప్యాకేజీ ఇస్తామన్నారు. అలాగే గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. వంశధార, మహేంద్ర తనయ నదులకు ఏటా వచ్చే వరదల కారణంగా తీర ప్రాంత గ్రామాల రైతులు, ప్రజలు నష్టపోతున్నారు. వరద గట్టుల నిర్మాణం పూర్తి చేస్తాం. రైతులను ఆదుకుంటాం. ఏనుగుల సమస్య పరిష్కారానికి కృషిచేస్తాను. అలాగే ఏబీ రోడ్డుతో పాటు గ్రామీణ రహదార్లు అధ్వానంగా ఉన్నాయి. -
పాతపట్నం.. కొత్తరూటు
సాక్షి, ఎల్ ఎన్ పేట, (శ్రీకాకుళం): పాతపట్నం.. జిల్లాలో అత్యంత చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న ప్రాంతం. వరాహ వెంకట గిరిని జాతికి అందించిన గడ్డ ఇది. ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన లుకలాపు లక్ష్మ ణదాస్ రాజకీయ ఓనమాలు దిద్దిందీ ఇక్కడే. చంద్రబాబు తన అనుచర గణాన్ని అంతా దింపినా లక్ష్మీపార్వతిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రాంతమిది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇతర పార్టీలూ ఉన్నా ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే. గత ఎన్నికల్లో స్థానిక ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టం కడితే.. వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కేస్తూ కలమట వెంకటరమణ టీడీపీకి ఫిరాయించారు. ఈ అంశమే ప్రస్తుత ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయబోతోందని స్థానికులంటున్నారు. అపురూప చరిత్ర.. పాతపట్నం నియోజకవర్గం 1952 నుంచి యాక్టివ్‌గా ఉంది. అప్పట్లో ద్విసభ్య శాసనసభగా ఉండేది. లుకలాపు లక్ష్మణదాస్, వీవీ గిరి నుంచి నేటి కలమట వెంకటరమణ వరకు దాదాపు పద్దెనిమిది మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మొదట్లో కాంగ్రెస్‌పై అభిమానం చూపిన నియోజకవర్గ ప్రజలు అనంతరం ఎన్టీఆర్‌పై అపార ప్రేమ చూపించారు. వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత కూడా ఇక్కడి ప్రజలు ఎన్టీఆర్‌వైపే నిలబడ్డారు. అందుకు నందమూరి లక్ష్మీపార్వతి గెలుపే నిదర్శనం. ఎన్టీఆర్ తర్వాత వైఎస్సార్‌పైనే ఇక్కడి వారు మళ్లీ అంతటి ప్రేమ చూపించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన శత్రుచర్ల విజయరామరాజు గెలుపొందగా, 2014లో కలమట వెంకటరమణ వైఎస్సార్ జెండా పట్టుకుని గెలుపొందారు. అయితే ఆయన ఆ జెండాను దింపేసి టీడీపీ జెండాను నెత్తినెత్తుకున్నారు. రాజీనామా చేయకుండానే టీడీపీలోకి ఫిరాయించి జనాభిప్రాయాన్ని కించపరిచారు. మొత్తం ఓటర్లు: 2,16,221 పురుషులు: 1,08,606 మహిళలు: 1,07,594 ఇతరులు: 17 మొత్తం పోలింగ్ కేంద్రాలు : 316 ప్రధాన సమస్యలు.. అభివృద్ధికి నోచుకోని వంశధార నిర్వాసితుల పునరావాస కాలనీ వంశధార నిర్వాసితులదే ఇక్కడి ప్రధాన సమస్య. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు సజావుగా జరిగి, ప్యాకేజీలు, పునరావాలు కూడా ఎలాం టి గొడవలు లేకుండా జరిగాయి. కానీ టీడీపీ అధికారం చేపట్టాక ఈ పనుల్లో గందరగోళం మొదలైంది. పునరావాస ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు లేదు. ఇళ్లు లేవు. వారికి రేషన్లు, పింఛన్లు, ఓట్లు చాలా సదుపాయాలు మృగ్యమైపోయాయి. వీటిపై ప్రశ్నించాల్సిన స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధికార పార్టీ పంచన చేరారు. దీంతో పాటు గిరిజన ప్రాంతం కూడా ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయి. విశిష్టతలు ♦ పాతపట్నం నుంచే రాజకీయ ఓనమాలు దిద్దిన వి.వి.గిరి (వరాహ వెంకట గిరి) కేంద్ర కార్మిక మంత్రి, భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించారు. ♦ పాతపట్నం నుంచి గెలిచిన లుకలాపు లక్ష్మణదాస్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా వెలుగొందారు. ♦ 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఉన్న కటౌట్‌ను ఏర్పాటు చేసి ప్రచారం చేసుకున్నందున టీడీపీ నుంచి గెలిచిన కలమట మోహనరావు ఎన్నికల చెల్లదంటూ అప్పటి ప్రత్యర్థి ధర్మాన నారాయణరావు (కాంగ్రెస్) కోర్టుకు వెళ్లడంతో 1996లో కలమట ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ♦ 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కలమట మోహనరావు సతీమణి వేణమ్మపై ఎన్టీఆర్ టీడీపీ తరఫున పోటీ చేసిన నందమూరి లక్ష్మీపార్వతి ఘన విజయం సాధించారు. లక్ష్మీపార్వతి విజయాన్ని అడ్డుకునేందుకు అప్ప టి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గాన్ని అంతా దించినా నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజార్టీని సాధించి లక్ష్మీపార్వతి ఎన్నికయ్యారు. కలమట కోటకు బీటలు 1978 నుంచి కలమట కుటుంబానికి కంచుకోటగా మారిన పాతపట్నం నియోజకవర్గంలో కలమట మోహనరావు ఐదు సార్లు, ఆయన కొడుకు కలమట వెంకటరమణమూర్తి ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ ఈ సారి ఆ కోటకు బీటలు పడనున్నట్లు తార్కాణాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 2016లో అధికార టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను ఓడించాలనే ధ్యేయంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 2016 నుంచి రాత్రి పగలు, కొండలు, నదులు అనే తేడా లేకుండా పల్లెపల్లెకు, గడప గడపకూ తిరిగారు. అన్ని వర్గాల వారితో కష్టసుఖాలు పంచుకున్నారు. దీనికి తోడు ఇసుక అక్రమ రవాణాలో కలమట అక్రమాలు జనాలకు తెలిసిపోయాయి. ఇవే ప్రస్తుత ఎలక్షన్లను ప్రభావితం చేయనున్నాయి. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
పాతపట్నం : మండలంలోని సరాలి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ సీపీలో ఆదివారం చేరారు. పాతపట్నంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు చెందిన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ యజ్జల రాజారావు, అనప బాబురావు, వున్న కేశకరావు, లండ ఆనందరావు, జలమాన లక్ష్మణరావు, జన్నం ప్రసాదరావు, పి.చిట్టిబాబు, కె.నారాయణరావు, కె.మొఖలింగం, జె.నారాయణరావు, పోలాకి తిరుపతి, పండా సింహాచలం, పడాల భాస్కరరావు, కె.సింహాచలం, పప్పు భాస్కరరావు, ఎల్.లక్ష్మణరావు, జి.దండాసీ, పి.వెంకటరావు, మెళియపుట్టి మండలం వసందర గ్రామానికి చెందిన సలాన జనార్దనరావుతో పాటు పలువురు ఉన్నారు. అధికార పార్టీ నాయకులు వారి అభివృద్ధి చూసుకుంటున్నారే తప్ప గ్రామాభివృద్ధి పట్టించుకోవడం లేదని వీరు వాపోయారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తురు మండల పార్టీ అధ్యక్షులు ఆర్.షణ్ముఖరావు, పాడి అప్పారావు, ఎస్.ప్రసాదరావు, అల్లు శకంరరావు, జిల్లా ప్రధానకార్యదర్శి రెగేటి కన్నయ్య స్వామి, పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ సెక్రటరీ కొండాల అర్జునుడు, రెడ్డి రాజు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు. -
రూ.2.8 కోట్లతో పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ
పాతపట్నం: జిల్లాలో ఉన్న పలు పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపడతున్నట్లు రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ డీఈఈ బి.ఎస్.ఎస్.ఆర్.కె.సాయిబాబు తెలిపారు. స్థానిక కోర్టు కూడలిలో పశు వైద్యశాల భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టెక్కలి, ఆమదాలవలస పోలీస్స్టేషన్లకు రూ.2.8కోట్లు నిధులు మంజురయ్యాయని, టెక్కలి పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. సోంపేట, రాగోలు, కళింగపట్నం, వీరఘట్టంలో పశువైద్యశాల భవనాలకు రూ.90లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. నరసన్నపేట, రణస్థలంలో రూ.4కోట్ల శాప్ నిధులతో రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని వివరించారు. పాత్రునివలస స్టేడియం పనులకు రూ.6కోట్లు నిధులు విడుదలయ్యాయని అన్నారు. ఆయనతో పాటు ఏఈ టి.కోదండరామ్ ఉన్నారు. -
అమ్మ వచ్చే వేళ
పాతపట్నం: ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పాతపట్నంలో కొలువై ఉన్న నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారిని జిల్లా వాసులతో పాటు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు నిత్యం దర్శించుకుంటుంటారు. 400 ఏళ్ల చరిత్ర నీలమణిదుర్గ అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఈ పాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఒడిశా పర్లాకిమిడిలో ఉన్న మహరాజులు పరిపాలన కోసం ఈ ప్రాంతం, టెక్కలిలో ఉన్న కోటకు వెళ్లే వారని ప్రతీతి. 1674 సంవత్సరం ప్రాంతంలో పర్లాకిమిడిను పరిపాలిస్తున్న గజపతి మహారాజకు చెందిన కూలీలు పొలం దుక్కి చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం నాగలికి తగిలి బయటపడిందని స్ధానికంగా ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. అనంతరం అమ్మవారు మహరాజు కలలో కనిపించి.. ఆలయాన్ని నిర్మించాలని సూచించడంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి పాతపట్నం నీలమణిదుర్గ దసరా ఉత్సవాలకు వైభవంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఐ బి.వి.వి ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కోసం పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులను విధులు అందించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కుంకుమపూజ, కలశపూజ, అష్టోత్తరశతనామపూజలు జరుగుతాయని, సాయంత్రం 3 గంటలకు సహస్రనామపూజ, కుంకుమపూజ ఉంటాయని ఈవో తెలిపారు. దసరా రోజు వాహనాలకు ప్రత్యేక పూజలు అమ్మవారు గుడి ప్రాంగణంలో కొత్తగా కొనుగోలు చేసిన రకరకాల వాహనాలతో పాటు ఇంత వరకు కలిగి ఉన్న వాహనాలకు దసరా రోజు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అలగే అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారు. -
భారీగా గుట్కా స్వాధీనం
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసులు రూ.లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం స్థానికంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి నర్సన్నపేటకు తీసుకువస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
దుప్పిపై కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో పునాదుల్లో పడిపోయిన ఓ దుప్పిని స్థానికులు రక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు భవనాల నిర్మాణానికి తీసిన పునాదుల గుంటల్లో ఆదివారం రాత్రి ఓ దుప్పి పడిపోయింది. దీనిపై కుక్కుల దాడి చేసి గాయపరిచాయి. అయితే, కుక్కల అరుపులతో ఇందిరమ్మ కాలనీకి చెందిన కొందరు యువకులు అక్కడికి చేరుకుని దుప్పిని కాపాడి సోమవారం ఉదయం అటవీ అధికారులకు అప్పగించారు. -
వేధింపులతోనే స్వాతి ఆత్మహత్య
పాతపట్నం : రైలు కింద పడి శనివారం ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సీ వసతిగృహ విద్యార్థిని నడగాన స్వాతి మృతికి వసతిగృహంలో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఈ విషయం ఆదివారం తెలిపారు. స్థానిక దువ్వారివీధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ వసతిగృహంలో ఉంటున్న స్వాతి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదని తల్లిదండ్రులు నడగాన గంగ, ఆనందరావు భోరుమన్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి పిల్లలను ఇక్కడ వసతిగృహంలో ఉంచి చదివిస్తుంటే వారే వేధించారని వాటిని తట్టుకోలేకే స్వాతి చనిపోరుుందని ఆరోపించారు. తమ కుమార్తె మృతికి మేట్రిన్, కుక్ కారణమని ఆరోపించారు. పాతపట్నం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వారు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పలాస రైల్వే ఎస్ఐ కె.మధుసూదనరావు, జిల్లా వసతిగృహ డీడీ ధనుంజయరావు, ఎంపీడీవో జగదీశ్వరరావు ఆధ్వర్యంలో వైద్యుడు కర్రి రామమూర్తి పోస్టుమార్టం నిర్వహించారు. -
రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య
పాతపట్నం (శ్రీకాకుళం) : పాతపట్నం మండలం సీతారాంపల్లి వద్ద రైలు కింద పడి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాతపట్నం ఎస్సీ బాలికల హాస్టల్లో ఉండే నడగాని స్వాతి(14) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కారణంగా రైలును పావుగంటపాటు అక్కడే నిలిపివేశారు. స్వాతి మృతదేహాన్ని పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతురాలిది లక్ష్మీనర్సుపేట మండలం ఎంబ్రం పంచాయతీ బద్దవలస గ్రామమని సమాచారం. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'
పాతపట్నం (శ్రీకాకుళం) : మీ ఇంటికే మీ భూమి కార్యక్రమం, జిల్లా కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారో తెలియజేస్తూ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. వీటి ద్వారా మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూరిందన్నారు. -
వరి చేనులో అగ్నిప్రమాదం
పాతపట్నం (శ్రీకాకుళం) : వరి చేనులో పంట నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ.2.75 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అంగరసింగి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పాండు తన వరి పొలంలో ట్రాక్టర్‌తో నూర్పిడి చేస్తుండగా మంటలు చెలరేగి ట్రాక్టర్ సహా వరి పంట కాలిపోయింది. ఈ ఘటనలో రూ.2.75 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు. -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..!
పాతపట్నం : పాతపట్నం మేజర్ పంచాయతీకి చెందిన వికలాంగులు మజ్జి చంద్రరావు, డోల శాంతిలు పెద్దలు సాక్షిగా శుక్రవారం ఒక్కటయ్యారు. కోటగుడి కాలనీకి చెందిన మజ్జి చంద్రరావు పుట్టుక తోనే అంధుడు. శివశంకర్ కాలనీ ఐదోలైన్లో ఉంటున్న డోల శాంతి పొట్టిమనిషి. వీరద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో గ్రామానికి చెందిన పెద్దలు కొంచాడ వీరభద్రరావు, శాసనపూరి మహేశ్వరావు, సవిరిగాన ప్రదీప్, జె.సోమేశ్వరావు, తిడ్డిమి శ్రీనువాసరావు, మిశ్రో తదితరులు స్థానిక వేంకటేశ్వర ఆలయంలో వీరి పెళ్లి జరిపారు. -
చెరువులో పడి బాలుడు మృతి
పాతపట్నం (శ్రీకాకుళం జిల్లా) : కలువ పూల కోసం చెరువులో దిగిన ఒక బాలుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శివశంకరకాలనీలో ఆదివారం ఉదయం జరిగింది. శివశంకరకాలనీకి చెందిన రామకృష్ణ, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీచరణ్‌కుమార్(12) ఆదివారం ఉదయం కలువపూల కోసం పక్కనే ఉన్న సీతారాంపల్లి చెరువుకు వెళ్లాడు. పూలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి మృతిచెందాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. -
రైలు కింద పడి ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
పాతపట్నం (శ్రీకాకుళం) : పాతపట్నం ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హేమసుందర్ రావు(30) అనే వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం సెలూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం రైలు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడని సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పలాస ఆస్పత్రికి తరలించారు. అయితే పలాస వైద్యులు మృతుడు హేమసుందర్ రావుగా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచరం అందించారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హతమార్చి అక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరెస్ట్
కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : అంగన్వాడీ అదనపు కార్యకర్తల నియామకం విషయంలో ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చిన పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆదివారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అంగన్వాడీ అదనపు కార్యకర్తల నియామకంలో జాప్యాన్ని నిరసిస్తూ సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయం ఎదట ధర్నాకు వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సీతంపేట వెళ్తుండగా కొత్తూరులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొత్తూరులోని నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ధర్నాకు దిగారు. పోలీసులు ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
భర్త హత్య కేసులో భార్య సహా కొడుకు అరెస్టు
పాతపట్నం : భర్తను హత్య చేశారన్న అభియోగంపై భార్యతోపాటు, కుమారుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని అచ్చుతపురంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి గురువారం ఉదయం నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ రాత్రి పాతపట్నం మేజర్ పంచాయతీ శివారు అచ్చుతపురం సాయినగర్ కాలనీకి చెందిన రగుతు జీవరత్నం హత్యకు గురయ్యాడన్నారు. దీనికి సంబంధించి మృతుని భార్య జ్యోతి, కుమారుడు పృథ్వీ పరారులో ఉండగా 24వ తేదీ సాయంత్రం గ్రామ శివారులో పట్టుకున్నామన్నారు. వారిని విచారించగా, ... తన భర్త రోజూ తాగి ఇంటికి వచ్చి పిల్లలను, తనను కొడుతూంటాడని, అతని వేధింపులను భరించలేక హత్యచేశామని చెప్పారన్నారు. పశువులకు కట్టిన రెండు నైలాన్ తాళ్లలో ఒకదాన్ని జీవరత్నం కాళ్లకు, రెండో తాడును మెడకు కట్టి కొడుకు సాయంతో గట్టిగా బిగించి హత్యచేసినట్లు నిందితులు తెలిపారని సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా హత్యకు ఉపయోగించిన రెండు నైలాన్ తాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో హెచ్‌సీ బి.సూర్యనారాయణ, శ్రీనివాసరావు ఉన్నారు. -
నదిలో పడి వ్యక్తి గల్లంతు
శ్రీకాకుళం: ప్రమాదవశాత్తు నదిలోపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని మహేంద్రతనయ నది కాలి వంతెన పై నుంచి జారిపడ్డాడు. బాధితుడి ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (పాతపట్నం) -
ఏజెన్సీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పర్యటన
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కె.వెంకటరమణ మంగళవారం తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీర్చుతానని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు. గతంలో తమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు తమ సమస్యలు పట్టించుకోలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి...తమ సమస్యలు... తెలుసుకుని..వాటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే వెంకటరమణ అని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ డ్యాం పూర్తి అయితే.. 5 మండలాలు ఎడారే!
పాతపట్నం : వంశధార ప్రాజెక్టు విషయంలో నానాయాగీ చేస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహేంద్రతనయ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్ట వల్ల దిగువనున్న శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు తాగు, సాగు నీరు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ఈ డ్యాం నిర్మాణాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, లేనిపక్షంలో జిల్లాలోని ఐదు మండలాలకు ముప్పు ఏర్పడుతుందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలోని గజపతి జిల్లా డంబాపూర్ వద్ద మహేంద్రతనయ నదిపై నిర్మిస్తున్న ఈ భారీ కట్టడాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. డ్యాం వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రూ.29 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డంబాపూర్ డ్యాం పనులు గత మూడేళ్లుగా జరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్మాణాన్ని అడ్డుకోకపోతే వేలాది రైతులు, ప్రజల జీవితాలు ఎడారిగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాం నిర్మాణం పూర్తయితే మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, నందిగాం, పలాస మండలాలకు చెందిన పలు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని వివరించారు. అలాగే మెళియాపుట్టి మండలంలో సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు చుక్కనీరైనా అందకుండాపోతుందన్నారు. మహేంద్రతనయ నదిపై మెళియాపుట్టి మండలంలో రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, అవి కూడా నీరందక వట్టిపోతాయని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న నదిపై ఎగువ భాగంలో మన రాష్ట్ర ప్రమేయం లేకుండానే ప్రాజెక్టులు నిర్మించుకుంటేపోతే, మనకు రావలసిన నీటి వాటా పరిస్థితి ఏమిటని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించారు. తక్షణమే ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితోపాటు జిల్లా మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఒడిశాతోపాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్మాణ పనులు నిలిపివేసేందకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆ ఊరికి.. తొలిసారి ఓ ఎమ్మెల్యే!
శ్రీకాకుళం: అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామాన్ని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధీ సందర్శించిన పాపాన పోలేదు. అలాంటి గ్రామానికి ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలోని మిలియాకుట్టి మండలం నవరజెర్రు భద్ర గ్రామాన్ని వైఎస్సార్సీపీకి చెందిన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కలమల వెంకటరమణ సందర్శించారు. ఇప్పటివరకు తమ గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే అంటూ ఎవరూ లేకపోవడంతో తొలుత గ్రామస్థులు ఇది నిజమేనా అని అనుమానపడ్డారు. అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
18 బైకుల దొంగ అరెస్టు
పాతపట్నం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పాతపట్నం పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అపహరించిన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు పాలకొండ డీఎస్పీ శనివారం నిందితుడి వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం వివరాలు... విశాఖపట్నం శాలిగ్రమపురం గ్రామానికి చెందిన కొట్లాన కనకరాజు అనే వ్యక్తి పాతపట్నం మండలం గంగువాడ గ్రామంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడని డీఎస్పీ దేవానంద్ శాంతో చెప్పారు. కాగా కనకరాజు వృత్తిరీత్యా కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అతడు ఇటీవల పాతపట్నం వచ్చాడు. పభాకర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం రోడ్డుపై ఉండగా అపహరించాడు. దీంతో ప్రభాకర్ పాతపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న కనకరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కనకరాజు వెల్లడించిన నిజాలకు పోలీసులు సైతం నివ్వెరపోయారు. విశాఖపట్నంలో 10, శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం పట్టణాల్లో 8 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు కనకరాజు వెల్లడించాడు. వృత్తిరీత్యా కనకరాజు కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కనకరాజు కేవలం ఫ్యాషన్ ప్లస్ వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. చోరీ చేసిన 18 వాహనాల్లో 12 వాహనాలు అవే కావడం విశేషం. సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్సై బి.సురేష్ ఆధ్వర్యంలో క్రైం పార్టీ మాధవ, ఉమ, మల్లేష్, లక్ష్మణ్‌లు కేసు ఛేదించినట్లు డీఎస్పీ తెలిపారు. -
'మాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు'
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. తమ పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కలమట వెంకట రమణ డిమాండ్ చేశారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన అన్నారు. -
శత్రు‘చెర’ వీడి..!
తాను ఏం చేసినా.. ఏం చెప్పినా.. అనుచరగణం జీ హుజూర్.. అంటారన్న బోల్డంత నమ్మకంతో రాజుగారు తెరవెనుక ఏర్పాట్లు చేసేసుకున్నారు. టీడీపీ నాయకత్వంతో ఒప్పందం కుదుర్చుకొని.. తన వర్గాన్నంతటినీ అందులో కలిపేయాలని నిర్ణయించేసుకున్నారు. ఆనక తీరిగ్గా.. కార్యకర్తల నిర్ణయం కోసమంటూ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మూడు దశాబ్దాలుగా టీడీపీతో పోరాడుతున్న తమను ఆ పార్టీకే తాకట్టు పెట్టడాన్ని సహించలే కపోయిన నేతలు ఎదురుతిరిగారు. పచ్చ చొక్క వేసుకోలేమని.. తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పారు. మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించి శత్రుచర్లకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. పాతపట్నం, న్యూస్‌లైన్: ‘టీడీపీలో చేరాలన్న మీ నిర్ణయం మాకు సమ్మతం కాదు.. అలా అయితే మా దారి మేం చేసుకుం టాం’.. అని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఆయన ప్రధాన అనుచరగణం తేల్చిచెప్పింది. దీంతో భారీ అనుచరగణంతో టీడీపీలో చేరాలన్న శత్రుచర్లకు శృంగభంగం ఎదురైంది. పాతపట్నం నియోజకవర్గంలో ఐదేళ్లుగా తనతో కలసి పనిచేసిన నేతలు, కార్యకర్తలతో ఆయన ఒడిశాలోని పర్లాకిమిడిలో మం గళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే శత్రుచర్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రధాన అనుచరుడు, మెళియాపుట్టి మాజీ ఎంపీపీ సలాన మోహనరావు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆరు నూరైనా తాము టీడీపీలో చేరేదిలేదని తేల్చిచెప్పారు. టీడీపీకి తామంతా వ్యతిరేకమని తేల్చిచెబుతూ సలాన మోహనరావుతోపాటు మెళియాపుట్టి మండలానికి చెందిన 24 మంది సర్పంచులు, ఇతర ముఖ్యనేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు సమావేశాన్ని బహిష్కరించారు. వారంతా ‘జైజగన్... జై వైఎస్సార్ కాంగ్రెస్’ అని నినాదాలు చేసుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో చేరాలన్న శత్రుచర్ల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సలాన మోహనరావు తనయుడు వినోద్ కుమార్ ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు. ముగిసిన తంతు సలాన వర్గం దెబ్బతో శత్రుచర్ల కంగుతిన్నారు. దాంతో సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించేశారు. కేవలం కొంతమందితో మాట్లాడించేసి మమ.. అనిపించారు. కొందరు సర్పంచులు మాట్లాడుతూ తాము రెండు రోజుల తరువాత నిర్ణయాన్ని చెబుతామని చెప్పి జారుకున్నారు. కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో నేతలు మాత్రమే శత్రుచర్ల వెన్నంటి ఉంటామన్నారు. పాతపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు మిర్యబెల్లి శ్యాం సుందరరావు మాట్లాడుతూ తనకు రెండేళ్ల తరువాత లభించే అవకాశమున్న డీసీసీబీ చైర్మన్ పదవినైనా వదులుకుంటాను గానీ శత్రుచర్లను మాత్రం వదులుకోలేనన్నారు. వీలైతే టీడీపీలోకి..లేదా రాజకీయ సన్యాసం: శత్రుచర్ల చివరగా శత్రుచర్ల మాట్లాడుతూ వీలైతే టీడీపీలో చేరుతానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. సోనియా గాంధీ చేసిన రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ మరో 20 ఏళ్లు కోలుకోలేదన్నారు. సోనియా చుట్టూ ఉన్న భజనపరులైన నాయకులే ఈ దుస్థితికి కారణమన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. టీడీపీలో చేరాలని కొందరు తనకు సూచించారన్నారు. రాజకీయాల్లో కొనసాగితే టీడీపీలో చేరుతానన్నారు. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఈ సమావేశంలో పాతపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు మిర్యబెల్లి శ్యాంసుందరరావు, పాతపట్నం ఏఎమ్‌సీ చైర్మన్ లింగాల జనార్ధన, కొత్తూరు ఏఎమ్‌సీ చైర్మన్ గోగుల చల్లంనాయు డు, ఎల్‌ఎన్‌పేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివాల తేజేశ్వరరావు, కొత్తూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు అగతముడి బైరాగి నాయుడు, హిరమండ లం ముఖ్య నాయకులు అందవరపు రమేష్, సురేష్, పాతపట్నం ఎంపీపీ మాజీ అధ్యక్షుడు నూర్తి దాల య్య, ఇతర నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. -
పక్క జిల్లాకూ పాకిన టీడీపీ జగడం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో కింజరాపు, కళా వర్గాల ఆధిపత్య పోరు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శత్రుచర్ల విజయరామరాజుకు కలసివచ్చింది. తన రాజకీయ పూర్వవైభవానికి అడ్డంకిగా మారిన కింజరాపు కుటుంబానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కళా వెంకట్రావు కన్ను శత్రుచర్ల మీద పడింది. పాతపట్నం టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్న శత్రుచర్లకు ఆయన తెరవెనుక మద్దతు అందించారు. దీనికి కారణం తన మద్దతుతో నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితుడైన సుధాకర్ అంతగా రాణించలేకపోవటమే. ఈ వైఫల్యం సాకుతో సుధాకర్‌ను తప్పించేందుకు కింజరాపు వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు శత్రుచర్లను తెరపైకి తెచ్చారు. వీరిద్దరి మధ్య గతంలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1998లో అప్పటి పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీగా శత్రుచర్ల గెలవడానికి కళానే సహకరించారు. ప్రస్తుతం కూడా శత్రుచర్ల ద్వారా పాతపట్నంలో ఆధిపత్యం సాధించి.. ఏకంగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో కింజరాపు వర్గానికి చెక్ పెట్టాలని వ్యూహం పన్నారు. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు వద్ద శత్రుచర్లకు మద్దతుగా పావులు కదిపారు. అసలే పాతపట్నంలో సరైన అభ్యర్థి లేక సతమతమవుతున్న చంద్రబాబు కూడా వెంటనే కళా ప్రతిపాదనకు సమ్మతించేశారు. కింజరాపు స్థానిక నినాదం పాతపట్నంలో శత్రుచర్ల రాకను అడ్డుకోవడానికి కింజరాపు వర్గం వెం టనే రంగంలోకి దిగింది. స్థానిక నినాదాన్ని లేవనెత్తి శత్రుచర్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు చేపట్టింది. గత ఐదేళ్లుగా శత్రుచర్ల తమ కార్యకర్తలను ఎంతగా వేధించిందీ కింజరాపు రామ్మోహన్నాయుడు పార్టీ అధినేతకు సోదాహరణంగా వివరించారు. కానీ చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. శత్రుచర్లే పాతపట్నం అభ్యర్థని తేల్చేశారు. దాంతో నీరుగారిపోయిన కింజరాపు కుటుంబానికి పొరుగు జిల్లా టీడీపీ కీలక నేత అశోక్‌గజపతి అనూహ్యంగా సహాయ హస్తం అందించారు. శత్రుచర్ల వద్దే..వద్దు శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను అశోక్‌గజపతిరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు శత్రుచర్ల స్వస్థలమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ రాజకీయాలే ప్రధాన కారణం. శత్రుచర్ల తనకు పాతపట్నం టిక్కెట్టు ఇవ్వమని చెప్పడంతోపాటు తన మేనల్లుడు, కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్‌ను అక్కడి అభ్యర్థిగా ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు. కానీ కురుపాంకు చెందిన కేంద్రమంత్రి, అరకు ఎంపీ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌తో అశోక్‌గజపతి కుటుంబానికి సమీప బంధుత్వం ఉంది. శత్రుచర్ల టీడీపీలో చేరితే కిశోర్ చంద్రదేవ్‌కు రాజకీయంగా ఇబ్బంది. అక్కడ ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయరాజ్ కేంద్రమంత్రి కిశోర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఓటు జయరాజ్‌కు, ఎంపీ ఓటు కిశోర్‌కు అన్న ఒప్పందం ప్రకారం టీడీపీ, కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో శత్రుచర్ల మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్ కురుపాం టీడీపీ అభ్యర్థి అయితే ఈ తెరచాటు రాజకీయాలకు కాలం చెల్లుతుంది. దీంతో కేంద్ర మంత్రి కిశోర్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఆదిలోనే శత్రుచర్లను టీడీపీలోకి రాకుండా అడ్డుకోవాలని అశోక్‌గజపతి అడ్డుచక్రం వేస్తున్నారు. అశోక్ ఉద్దేశం ఏమైనప్పటికీ ఆయన వ్యూహం మాత్రం జిల్లాలో కింజరాపు శిబిరానికి కలసివచ్చింది. అశోక్ అండతో పాతపట్నం టిక్కెట్లు శత్రుచర్లకు దక్కకుండా చేయాలని, అనూహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మలచుకోవాలని రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు భావిస్తున్నారు. దీనిపై కళా, శత్రుచర్ల వర్గాలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాలతో శత్రుచర్ల చేరిక వ్యవహారం ఏకంగా రెండు జిల్లాల టీడీపీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. దాంతో పార్టీలో విభేదాల పీటముడి మరింతగా బిగుసుకుంటోంది. -
అనుమానంతో భార్య హత్య
పాతపట్నం : అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని బూరగాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బూరగాం గ్రామంలో యర్లంకి దుర్గారావు కూలి పని చేస్తుంటాడు. మద్యానికి బానిస కావడంతో దుర్గారావుకు, అతని భార్య సుశీల (30)కు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొంతకాలంగా భార్యపై అనుమానంతో ఉన్న అతను శుక్రవారం ఇంట్లో భార్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలో గల పొలాల్లో పడేసి వరిగడ్డితో కప్పేశాడు. అతను అక్కడ సంచరిస్తుండడంతో స్థానికులు అనుమానించడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుశీల హత్య ఉదంతం తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి కుమార్తె చిట్టెమ్మ ఏడాదిన్నర కిందట మృతి చెందింది. కుమారుడు పెంటయ్య ఉన్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సురేష్‌బాబు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పాతపట్నం రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని కాగువాడ వద్ద గల సీతారామ కల్యాణ మండపం వద్ద సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మంగి నాగరాజు (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బూరగాం గ్రామానికి చెందిన నాగరాజు తాపీమేస్త్రిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, చిన్న, కుమార్తెలు జ్యోతి, భాగ్యం, తల్లి రమణమ్మ ఉన్నారు. మోటార్ సైకిల్ అదుపుతప్పడంతో కార్మికుడికి గాయాలు పాతపట్నం : రోడ్డు ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అచ్చుతాపురం వద్ద మంగళవారం జరిగిన ప్రమాద వివరాలిలా ఉన్నాయి. అందాల ప్రసాద్ అనే కార్మికుడు పర్లాకిమిడి నుంచి పాతపట్నం వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. అచ్చుతాపురం వద్ద వాహనం అదుపు తప్పడంతో ఆయన గాయాల పాలయ్యాడు. బాధితుడిని స్థానికులు పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ సదాశివ ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సురేష్‌బాబు తెలిపారు. ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి... టెక్కలి : టెక్కలి పాత జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన డొక్కరి బాలకృష్ణ గ్రామంలో నుంచి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా, కోటబొమ్మాళి నుంచి టెక్కలి వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలకృష్ణతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న పాకివలస గ్రామానికి చెందిన యర్ర గణపతి, బొప్పాయిపురం గ్రామానికి చెందిన చిగురువలస అప్పన్న తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సలో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. దీనిపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనం ఢీకొని ఒకరికి... లావేరు : మండలంలోని బొంతుపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనం ఢీకొని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని గుమడాం గ్రామానికి చెందిన యండపల్లి చిన్నారావు సైకిల్‌పై బొంతుపేట గ్రామానికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తిరిగి స్వగ్రామం వెళుతూ బొంతుపేట గ్రామం వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారావును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. ఎస్సై అప్పారావు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలను సేకరించారు. రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరికి.... ఇచ్ఛాపురం : పట్టణ శివారులోని గ్యాస్ ఏజెన్సీ వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఒడిశాలోని సుమండి గ్రామానికి చెందిన శివశంకర్ బెహరా, అతని స్నేహితుడు ఇచ్ఛాపురం నుంచి తమ గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో వికలాంగుడైన శివశంకర్‌కు వైకల్యం ఉన్న కుడి కాలికి రెండు చోట్ల ఫ్రాక్చరైంది. బాధితుడిని 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ హెచ్‌సీ జనార్దనరావు తెలిపారు. ఆటో బోల్తాపడి ముగ్గురికి... కవిటి : ఆటో బోల్తాపడిన ఘటనలో ముగ్గురు గాయాల పాలయ్యారు. బట్టివానిపాలెం నుంచి పలువురు మత్స్యకార మహిళలు శిలగాం జంక్షన్‌లోని మంగళవారం సంతకు వెళుతున్నారు. జగతి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కె.కామమ్మ, డ్రైవర్ యుగంధర్, కె.ఎర్రమ్మ గాయపడ్డారు. బాధితులను 108లో ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ యుగంధర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. కామమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై వై.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్మాడ వరకు.. సైకిల్ తొక్కేస్తారు!
మనం మాత్రమే సైకిల్‌పై సవారీ చేయాలి.. పార్టీలో మన ప్రత్యర్థులను అదే సైకిల్ కింద పడేసి తొక్కేయాలి.. ఇదీ కింజరాపు కుటుంబం రాజకీయ గేమ్ ప్లాన్. ఆ స్కెచ్ ప్రకారమే కింజరాపు అబ్బాయిగారి సైకిల్ యాత్ర సాగుతోంది. పాతపట్నంలో ఈ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో అక్కడి పార్టీ ఇన్చార్జిని సీన్లోంచి బయటకు నెట్టేయడం మొదలుకొని.. యాత్ర ముగింపు వేదికను జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి స్వగ్రామమైన నిమ్మాడకు మార్చడం వరకు అంతా ప్రత్యర్థులను అణగదొక్కి.. హోల్‌సేల్‌గా క్రెడిట్ కొట్టేసే వ్యూహంలో భాగమే. శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: టీడీపీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి కింజ రాపు రామ్మోహన్నాయుడు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమ వేదికను ఉన్నట్టుండి నిమ్మాడకు మార్చడంతో ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్న రామ్మోహన్నాయుడు ఈ నెల ఒకటో తేదీ నుంచి 23 వరకు ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైకిల్ యాత్ర నిర్వహణకు పూనుకున్నారు. ఆ మేరకు పాతపట్నంలో యాత్ర ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి అయిన కళా వెంకట్రావు వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్‌ను పూర్తిగా పక్కన పెట్టి తమ వర్గీయుడైన కలిశెట్టి అప్పలనాయుడుతో అన్ని ఏర్పాట్లు చేయించడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. దీనికి నిరసనగా కొవగాపు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ముగింపు కార్యక్రమం విషయంలోనూ కింజరాపు శిబిరం ఇదే తరహా వ్యూహం అనుసరిస్తుండటం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది. గుండకు క్రెడిట్ దక్కకూడదనే... ఒకటో తేదీన పాతపట్నంలో ప్రారంభమైన యాత్ర ను వాస్తవానికి ఎర్రన్నాయుడు జయంతి అయిన ఈ నెల 23న లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం.. అందులోనూ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ముగించాల్సి ఉంది. ఆరోజు శ్రీకాకుళంలో భారీ ఎత్తున ముగింపు సభ నిర్వహిస్తామని యాత్ర ప్రారంభానికి ముందే జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ పత్రికాముఖంగా కూడా వెల్లడించారు. అయితే శ్రీకాకుళంలో సభ నిర్వహిస్తే తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణకు ఆ క్రెడిట్ దక్కుతుందని భావించి ముగింపు వేదికను బాబాయి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన నిమ్మాడకు మార్చేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. జిల్లా కేంద్ర ంలో ఇటీవల కాలంలో పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు నిర్వహించనందున సైకిల్‌యాత్ర ముగింపు సభను ఇక్కడే భారీ జన సమీకరణతో నిర్వహిస్తే బాగుంటుందనే భావన వారిలో ఉంది. అయితే సభ విజయవంతమైతే ఆ ఘనత గుండ అప్పలసూర్యనారాయణ ఖాతాలోకి వెళ్లిపోతుందన్న భయంతో కింజరాపు శిబిరం వేదికను మార్చేసి, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం కూడా ప్రారంభించేసింది. అచ్చెన్న పట్టు పట్టడమే కారణం భారీ ఎత్తున తలపెట్టిన ముగింపు సభను శ్రీకాకుళంలో కాకుండా తన సొంత నియోజకవర్గమైన టెక్కలి పరిధిలోని నిమ్మాడలో నిర్వహిస్తే తనకు కూడా కలిసివస్తుందన్న ఆలోచనతో ఆ నియోజకవర్గ ఇన్చార్జి అచ్చెన్నాయుడు పావులు కదిపారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా రామ్మోహ న్ సైకిల్ యాత్ర ద్వారా అందే ఫలాల్లో తానూ కొంత స్వీకరించాలని భావించి వ్యూహం రచించారు. ఇదే నియోజకవర్గంలో కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ నిర్మాణం తలనొప్పిగా మారడం, మరోవైపు వైఎస్సార్సీపీ పక్కలో బల్లెంలా తయారవడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న అచ్చెన్న సైకిల్ యాత్ర ముగింపు సభతోనైనా యాత్రతోనే కొంత మైలేజి సాధించాలని భావిస్తున్నారు. ఆయన వ్యూహం ప్రకారమే జిల్లా కేంద్రాన్ని కాదని నిమ్మాడకు కార్యక్రమాన్ని మార్చారని అంటున్నారు. తమ సొంత ప్రయోజనాల గురించే ఆలోచించిన వీరు, దీనివల్ల జిల్లాలో పార్టీలో విభేదాలు మరింత ముదిరి ఎన్నికల్లో చేటు చేస్తాయన్న విషయాన్ని విస్మరించారని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
పాతపట్నంలో ప్రైవేటు ఆస్పత్రి సీజ్
పాతపట్నం, న్యూస్‌లైన్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కనకమహాలక్ష్మి మెడికేర్‌పై అధికారులు కొరడా ఝులి పించారు. పాలకొండ ఆర్డీవో ఎస్.తేజ్‌భరత్, ఇతర అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు జరిపారు. అనుమతి ప త్రాలు లేకుండా మెడికల్ స్టోర్, ల్యాబ్, ఆస్పత్రి రెండేళ్ల నుం చి నిర్వహిస్తుండడాన్ని గుర్తించి..విస్తుపోయారు. కనీసం వైద్యుడు కూడా లే కుండా ఎలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంబంధిత యాజమాన్యం పత్రాలు చూపించకపోవడంతో..వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించా రు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే..ఆస్పత్రులు, ల్యా బ్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ బి.ఎస్.ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.లక్ష్మీనారాయ ణ, వీఆర్వో మురళీ, పాతపట్నం ఎస్పీహెచ్వో డాక్టర్ వేణుగోపాల్, సీహెచ్‌వో ఐ.నారాయణరావు, సీనియర్ సహాయకుడు శేఖర్ పట్నాయక్, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ పైల ప్రియాంక సమక్షంలో మెడికేర్‌ను సీజ్ చేశారు.