
ఆ ఊరికి.. తొలిసారి ఓ ఎమ్మెల్యే!
శ్రీకాకుళం: అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామాన్ని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధీ సందర్శించిన పాపాన పోలేదు. అలాంటి గ్రామానికి ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెళ్లారు.
శ్రీకాకుళం జిల్లాలోని మిలియాకుట్టి మండలం నవరజెర్రు భద్ర గ్రామాన్ని వైఎస్సార్సీపీకి చెందిన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కలమల వెంకటరమణ సందర్శించారు. ఇప్పటివరకు తమ గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే అంటూ ఎవరూ లేకపోవడంతో తొలుత గ్రామస్థులు ఇది నిజమేనా అని అనుమానపడ్డారు. అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.