అంగన్‌వాడీ అదనపు కార్యకర్తల నియామకం విషయంలో ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చిన పాతపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : అంగన్‌వాడీ అదనపు కార్యకర్తల నియామకం విషయంలో ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చిన పాతపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆదివారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అంగన్‌వాడీ అదనపు కార్యకర్తల నియామకంలో జాప్యాన్ని నిరసిస్తూ సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయం ఎదట ధర్నాకు వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సీతంపేట వెళ్తుండగా కొత్తూరులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొత్తూరులోని నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ధర్నాకు దిగారు. పోలీసులు ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.