పాటపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
శ్రీకాకుళం: పాటపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ధ్రువీకరించారు. మార్చి 4న టీడీపీలో చేరుతున్నట్లు కలమట వెంకటరమణ తెలిపారు. కొత్తూరు మండలం మాతాలలో ఆయన ఈరోజు ఉదయం మాట్లాడారు. కాగా కొద్దిరోజులుగా కలమట టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.