పాతపట్నం ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హేమసుందర్ రావు(30) అనే వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు.
పాతపట్నం (శ్రీకాకుళం) : పాతపట్నం ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హేమసుందర్ రావు(30) అనే వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం సెలూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం రైలు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడని సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పలాస ఆస్పత్రికి తరలించారు.
అయితే పలాస వైద్యులు మృతుడు హేమసుందర్ రావుగా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచరం అందించారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హతమార్చి అక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.