వేధింపులతోనే స్వాతి ఆత్మహత్య
పాతపట్నం : రైలు కింద పడి శనివారం ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సీ వసతిగృహ విద్యార్థిని నడగాన స్వాతి మృతికి వసతిగృహంలో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఈ విషయం ఆదివారం తెలిపారు. స్థానిక దువ్వారివీధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ వసతిగృహంలో ఉంటున్న స్వాతి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదని తల్లిదండ్రులు నడగాన గంగ, ఆనందరావు భోరుమన్నారు.
జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి పిల్లలను ఇక్కడ వసతిగృహంలో ఉంచి చదివిస్తుంటే వారే వేధించారని వాటిని తట్టుకోలేకే స్వాతి చనిపోరుుందని ఆరోపించారు. తమ కుమార్తె మృతికి మేట్రిన్, కుక్ కారణమని ఆరోపించారు. పాతపట్నం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వారు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పలాస రైల్వే ఎస్‌ఐ కె.మధుసూదనరావు, జిల్లా వసతిగృహ డీడీ ధనుంజయరావు, ఎంపీడీవో జగదీశ్వరరావు ఆధ్వర్యంలో వైద్యుడు కర్రి రామమూర్తి పోస్టుమార్టం నిర్వహించారు.