వరి చేనులో అగ్నిప్రమాదం | Fire accident in Rice farm | Sakshi
Sakshi News home page

వరి చేనులో అగ్నిప్రమాదం

Published Fri, Dec 18 2015 4:27 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Rice farm

పాతపట్నం (శ్రీకాకుళం) : వరి చేనులో పంట నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ.2.75 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అంగరసింగి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పాండు తన వరి పొలంలో ట్రాక్టర్‌తో నూర్పిడి చేస్తుండగా మంటలు చెలరేగి ట్రాక్టర్ సహా వరి పంట కాలిపోయింది. ఈ ఘటనలో రూ.2.75 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement