Rice farm
-
చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి ఏకంగా వరి పంటతో తయారుచేసి అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. సదరు అభిమానిని తాజాగా చరణ్ తన నివాసంలో కలిశాడు. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ అరుదైన కానుక ఇచ్చిన సదరు ఫ్యాన్‌కు చెర్రి ఆత్మీయ ఆహ్వానం పలికాడు. అయితే ఆ వ్యక్తి చరణ్‌ను కలిసేందుకు 264 కిలోమీటర్లు నడిచి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో చరణ్ తన అభిమానికి ఆత్మీయ ఆహ్వానం పలికాడు.కాగా తెలంగాణలోని గద్వాల్ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: F3 First Day Box Office Collections: ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే..? గట్టు మండలం ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. గత మార్చిలో ఈ ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఈ ఫొటోలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు జైరాజ్ 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్‌ను కలుసుకున్నాడు. చరణ్ నివాసంలో ఆయనను కలిసి బియ్యం గింజలతో తాను వేసిన చరణ్ బొమ్మ ఫొటోలతో పాటు, వరి వీడియోను కూడా చూపించాడు. జైరాజ్ అభిమానాన్ని చూసి చరణ్ మురిసిపోయాడు. అతడి ఆర్ట్‌కి ఫిదా అయిన చెర్రి జైరాజ్‌ను ప్రశంసించాడు. -
Ram Charan: రామ్ చరణ్ బర్త్‌డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్
సాక్షి, గట్టు (మహబూబ్‌నగర్): సినీనటుడు రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి వరి పంటతో తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన సంధ్యాజయరాజ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. గట్టు మండలంలోని ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని అభిమాన నటుడు రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. డ్రోన్‌తో ఆకాశం నుంచి వరి చేలలోకి చూస్తే ఈ ముఖచిత్రం కనిస్తుంది. రెండు రోజుల క్రితమే అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయు డు ఈ చిత్రాన్ని పరిశీలించి అభినందించారు. కాగా, ఆదివారం రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వరి పంటతో చరణ్ పట్ట తన అభిమానాన్ని చాటుకున్నాడు. చదవండి: అమృత్‌సర్‌కి రామ్ చరణ్, ఎందుకంటే..? -
వరి చేనులో అగ్నిప్రమాదం
పాతపట్నం (శ్రీకాకుళం) : వరి చేనులో పంట నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ.2.75 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అంగరసింగి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పాండు తన వరి పొలంలో ట్రాక్టర్‌తో నూర్పిడి చేస్తుండగా మంటలు చెలరేగి ట్రాక్టర్ సహా వరి పంట కాలిపోయింది. ఈ ఘటనలో రూ.2.75 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు.