Ram Charan Birthday: Short Film Director Made Hero Photo With Rice Crop In Mahabubnagar - Sakshi
Sakshi News home page

Ram Charan Fan Gift: రామ్‌ చరణ్‌ బర్త్‌డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్‌

Published Sun, Mar 27 2022 10:38 AM | Last Updated on Sun, Mar 27 2022 2:19 PM

Mahabubnagar: Short Film Director Made Hero Ram Charan Photo with Rice Crop - Sakshi

సాక్షి, గట్టు (మహబూబ్‌నగర్‌): సినీనటుడు రామ్‌ చరణ్‌ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి వరి పంటతో తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన సంధ్యాజయరాజ్‌ షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. గట్టు మండలంలోని ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని అభిమాన నటుడు రామ్‌ చరణ్‌ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు.

డ్రోన్‌తో ఆకాశం నుంచి వరి చేలలోకి చూస్తే ఈ ముఖచిత్రం కనిస్తుంది. రెండు రోజుల క్రితమే అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయు డు ఈ చిత్రాన్ని పరిశీలించి అభినందించారు. కాగా, ఆదివారం రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వరి పంటతో చరణ్‌ పట్ట తన అభిమానాన్ని చాటుకున్నాడు. 
చదవండి: అమృత్‌సర్‌కి రామ్‌ చరణ్‌, ఎందుకంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement