మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి ఏకంగా వరి పంటతో తయారుచేసి అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. సదరు అభిమానిని తాజాగా చరణ్ తన నివాసంలో కలిశాడు. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ అరుదైన కానుక ఇచ్చిన సదరు ఫ్యాన్‌కు చెర్రి ఆత్మీయ ఆహ్వానం పలికాడు. అయితే ఆ వ్యక్తి చరణ్‌ను కలిసేందుకు 264 కిలోమీటర్లు నడిచి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో చరణ్ తన అభిమానికి ఆత్మీయ ఆహ్వానం పలికాడు.కాగా తెలంగాణలోని గద్వాల్ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: F3 First Day Box Office Collections: ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే..?
గట్టు మండలం ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. గత మార్చిలో ఈ ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఈ ఫొటోలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు జైరాజ్ 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్‌ను కలుసుకున్నాడు. చరణ్ నివాసంలో ఆయనను కలిసి బియ్యం గింజలతో తాను వేసిన చరణ్ బొమ్మ ఫొటోలతో పాటు, వరి వీడియోను కూడా చూపించాడు. జైరాజ్ అభిమానాన్ని చూసి చరణ్ మురిసిపోయాడు. అతడి ఆర్ట్‌కి ఫిదా అయిన చెర్రి జైరాజ్‌ను ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment