చరణ్‌కు ఇల్లు కట్టిన ఫ్యాన్‌‌.. స్వయంగా కలిసిన హీరో.. | Ram Charan Met His Fan Who Gifted Him A house Made Of Coconut Broomsticks | Sakshi
Sakshi News home page

చరణ్‌కు ఇల్లు కట్టిన ఫ్యాన్‌.. స్వయంగా కలిసిన హీరో..

Published Thu, Mar 25 2021 8:50 PM | Last Updated on Thu, Mar 25 2021 8:54 PM

Ram Charan Met His Fan Who Gifted Him A house Made Of Coconut Broomsticks - Sakshi

తాము ఇష్టపడే హీరో, హీరోయిన్లపై ఫ్యాన్స్‌ పిచ్చి అభిమానం చూపిస్తుంటారు. వారి పుట్టిన రోజులు, సినిమా రిలీజ్‌ అప్పుడు  ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటారు. కానీ అలా చేసే అవకాశం రాకపోవచ్చు. అయితే బంజారాహిల్స్‌కు చెందిన బొడ్డు శ్రీమతి అనే మహిళకు టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ అంటే అమితమైన అభిమానం. ఆయన అన్ని సినిమాలను తప్పకుండా ఫాలో అవుతుంటుంది. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు. దీంతో తన కోసం ఓ అందమైన బహుమతిని తయారు చేసింది. కొబ్బరి చీపురుతో చూడ ముచ్చటైన ఓ ఇంటిని నిర్మించింది. ఈ విషయం తెలుసుకున్న చరణ్‌ ఎంతో ఉప్పొంగిపోయాడు. అంతేగాక వారిని స్వయంగా కలుసుకొని ఆ ఇంటిని స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక కెరీర్‌ పరంగా రామ్‌ చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం,రణం,రుధిరం) చిత్రంలో నటిస్తున్నాడు. చరణ్‌తోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, అలియా భట్‌, ఒలివియా, అజయ్‌ దేవ్‌గన్‌  ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్‌ 13న విడుదలకు సిద్ధమవుతోంది. అంతేగాక చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్యలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధ అనే  పాత్రలో అలరించనున్నాడు. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి:
వైరలవుతున్న రామ్‌చరణ్‌- ఉపాసన ఫోటో

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement