Ram Charan Fulfilled His His Boy Fan Wish Who Suffered With Cancer - Sakshi
Sakshi News home page

Ram Charan: తన బుల్లి ఫ్యాన్‌ కోరిక తీర్చిన రామ్‌ చరణ్‌, హీరోపై ప్రశంసలు

Published Thu, Feb 9 2023 8:37 PM | Last Updated on Thu, Feb 9 2023 8:51 PM

Ram Charan Fulfilled His His Boy Fan Wish Who Suffered With Cancer - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ చిన్నారి చివరి కోరిక తీర్చి ఉదారత చాటుకున్నాడు. తొమ్మిదేళ్ల మణి కుశాల్‌ అనే చిన్నారి రామ్‌ చరణ్‌కు వీరాభిమాని. అయితే అతడు కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్పర్శ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడు హీరో రామ్‌ చరణ్‌ను కలవాలి అంటూ తన కోరికను తల్లిదండ్రులకు వెల్లడించాడు. దాంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ వారు ఈ విషయాన్ని రామ్ చరణ్‌కు చేరవేయగా వెంటనే స్పందించాడు.  

చదవండి: సరిగమప విన్నర్‌ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ

తన బుల్లి ఫ్యాన్‌ని కలిసేందుకు స్వయంగా చరణ్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆ బాలుడితో కాసేపు సరదాగా గడిపాడు. అంతేకాదు ఆ బాలుడికి ఓ బహుమతిగా ఇచ్చాడు. అనంతరం అతడిలో ధైర్యం నింపాడు. అలాగే మణి త్వరలోనే కోలుకుంటాడని ఆ బాలుడి తల్లిదండ్రులు చరణ్‌ భరోసా ఇచ్చాడు. చెర్రి ఆ అభిమానిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవి చూసి నెటిజన్లు రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ మూవీ ఆర్‌సీ15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. 

చదవండి: కొత్త పెళ్లి కూతురు కియారాకు అత్తింటి వారి ఘనస్వాగతం, వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement