నీటియానం
ఆరోగ్యం, పర్యావరణం బాగుండాలంటే కార్లు, మోటర్‌బైక్‌లు వదిలేసి సైకిలెక్కడం మేలని చాలామంది చెబుతారు. కానీ... రయ్యి రయ్యి మని కార్లు దూసుకెళుతూంటే... వాటి మధ్యలో బిక్కుబిక్కుమంటూ సైకిలెలా తొక్కాలి? అనేదేనా మీ డౌట్! నో ప్రాబ్లెమ్ అంటోంది సెకెండ్ షోర్! షికాగో పట్టణంలో ఈ కంపెనీ కేవలం సైక్లిస్టుల కోసం ఓ నదిపై తేలియాడే బ్రిడ్జీని ఏర్పాటు చేసింది మరి. పక్క ఫొటోలో కనిస్తున్నది ఆ బ్రిడ్జీ డిజైనే. మంచు కురిసే షికాగో వాతావరణాన్ని తట్టుకునేందుకు ఈ బ్రిడ్జీపై సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతో బ్రిడ్జీపైనున్న మంచును తొలగిస్తారన్నమాట. మూసీ నది వెంబడి.. లేదంటే కృష్ణా, గోదావరి తీరాల వెంబడి అక్కడక్కడా ఇలాంటివేస్తే పోలా? సేఫ్టీకి సేఫ్టీ... నాలుగు రూకలు ఆదా అవుతాయి కూడా!