నిండని భద్రకాళి జలాశయం
వర్షకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ నగరంలోని పలు జలాశయాలు ఇంకా పూర్తిగా నిండలేదు. ఇటీవల కుండపోతగా వర్షాలు కురిసినప్పటికీ వరంగల్ భద్రకాళి చెరువులో నీటిమట్టం పెరగలేదు. దీంతో పరిసర ప్రాంతాలకు చెం దిన ప్రజలు నీటికోసం ఆందోళనకు గురవుతున్నారు. వరుణదేవుడు మరోసారి కరుణించి భారీ వర్షాలు కురిపించి భద్ర కాళి చెరువును నింపాలని వారు వేడుకుంటున్నారు.