
వంతెన కూలిన దృశ్యం
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సోమవారం సాయంత్రం మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య ఫాల్గుని నదిపై కూలిపోయిన మాలూరుపట్న పాతవంతెన. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరగలేదని అధికారులు చెబుతున్నారు.
సాక్షి, బెంగళూరు: దక్షిణ కన్నడ జిల్లాలోని మాలూరుపట్న వద్ద ఫాల్గుని నదిపై ఉన్న పాత వంతెన వర్షాలకు సోమవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య రాకపోకలు స్తంభించాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఈ వంతెన నిర్మించారు. గత కొన్ని వారాలుగా దక్షిణ కన్నడ జిల్లాతో పాటు కరావళి ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షాల ధాటికి తడిసి ముద్దయిన వంతెనలో కొంతభాగం ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు వంతెనకు ఇరువైపులా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆ వంతెనను మూసివేశారు.
ఇసుక తవ్వకాలతో నష్టం
మాలూరుపట్న ప్రాంతంలో కొన్నేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకాల ఫలితంగా వంతెన పిల్లర్లు దెబ్బతిన్నాయి. కాగా ఇటీవల ఇసుక తవ్వకాలను నిషేధించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వంతెన కూలడంతో కుప్పెడవు, కైకాంబ, ఇరువేల్, ఇడపడవు, గంజిమట్, సురత్‌కాల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment