కాసర్‌గోడ్: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్ మ్యాప్స్‌లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు.
‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్ షేర్ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment