Two young men
-
గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ నదిలోకి..
కాసర్గోడ్: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్ మ్యాప్స్‌లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు. ‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్ షేర్ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. -
HYD: ఇద్దరి ప్రాణం తీసిన గాలిపటాలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ పూట గాలిపటాల సరదా రాజధాని నగరంలో ఇద్దరి ప్రాణాలు తీసింది. రోడ్డుపై వెళుతూ చైనా మాంజా దారం తగిలి ఆర్మీ లో డ్రైవర్‌గా పని చేసే కోటేశ్వేర్ రెడ్డి మృతి చెందాడు. మరో ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ అల్వాల్ పీఎస్‌లో పనిచేసే ఏఎస్సై కుమారుడు ఆకాష్ ఇంటిపై నుంచి కిందపడి మరణించాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌజ్‌స్ ఫ్లైఓవర్‌పై అడ్డుగా ఉన్న చైనా మాంజా మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటేశ్వర్‌రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేరే ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవశాత్తు భవనం పైనుండి పడి ఆకాష్(20) అనే యువకుడు మృతి చెందాడు. పేట్ బహీరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆకాష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సహచర ఉద్యోగి కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసుస్టేషన్‌లోలోనూ విషాద చాయలు అలుముకున్నాయి. ఇదీచదవండి.. తెలంగాణలో హత్యా రాజకీయాలు చెల్లవు: కేటీఆర్ -
ప్రాణాలు తీసిన ఈత సరదా
ములుగు(గజ్వేల్): సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ వద్ద చోటుచేసుకుంది. గజ్వేల్ ఏసీపీ రమేశ్ తెలిపిన మేరకు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన బోయిన్పల్లి మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన రాజన్‌శర్మ (27), కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ – 4 మహవీర్ టవర్‌కు చెందిన వండ్లముడి అక్షయ్‌వెంకట్(28), రామ్‌కోఠికి చెందిన రుషబ్‌షాలు మిత్రులు. ఈ ముగ్గురూ ఆదివారం సరదాగా గడిపేందుకు కొండపోచమ్మ సాగర్ వద్దకు కారులో చేరుకున్నారు. వారు కట్టపై కొద్దిసేపు సరదాగా గడిపిన అనంతరం అక్షయ్‌వెంకట్, రాజన్‌శర్మ సాగర్‌లో ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు అందులోనే మునిగి మృతిచెందారు. సమాచారమందుకున్న గజ్వేల్ ఏసీపీ రమేశ్, గజ్వేల్ రూరల్ సీఐ కమలాకర్, ములుగు, మర్కూక్ ఎస్ఐలు రంగకృష్ణ, శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే గజ ఈతగాళ్లను రప్పించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు గజ్వేల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ములుగు ఎస్ఐ రంగకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: లాభం పేరిట లూటీ! నాలుగు నెలల్లో 48 కేసులు) -
ఆగని అత్యాచార పర్వం
ముజఫర్‌నగర్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు యువకులు ఓ యువతిని నమ్మించి, పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువతిపై యోగేశ్ కుమార్, బబ్లు అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. అత్యాచారాన్ని ఫోన్లో రికార్డు చేశారు. అనంతరం ఫోన్ నుంచి వీడియో తొలగిస్తానని చెప్పి యోగేశ్ కుమార్ ఆ యువతిపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకపోగా, మరిన్ని బెదిరింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసే ప్రక్రియ సాగుతోందని పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రలో.. 20 ఏళ్ల యువతిపై కదులుతున్న రైల్లో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి లక్నో–ముంబై పుష్ఫక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇగత్పురి, కసర స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి సమయంలో రైలు ఘాట్ మార్గంలో ప్రయాణిస్తుండగా అత్యాచారం జరిగిందన్నారు. కర్ణాటకలో... దక్షిణ కన్నడ జిల్లా బంటా్వళ తాలూకాలో మైనర్ బాలికకు మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో మైనర్ బాలిక (16) స్కూల్‌కు నడిచి వెళ్తుండగా తెల్లని కారులో వచి్చన దుండగులు బాలికను అపహరించారు. దూరంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి మత్తు పానీయం తాగించి మూకుమ్మడిగా లైంగికదాడి చేసి అక్కడికి దగ్గరలో వదిలేసి వెళ్లారు. కొంతసేపటికి మత్తు నుంచి తేరుకున్న నేరుగా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈ ఘోరం గురించి ఫిర్యాదు చేసింది. ఐదుమంది అత్యాచారం చేశారని, వారి పేర్లను కూడా వెల్లడించింది. జార్ఖండ్‌లో.. జార్ఖండ్‌లో 14 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల వృద్ధుడు గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సిండేగా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తండ్రి కేరళలో పని చేస్తుండగా, తల్లి ఉదయాన్నే పనులకు వెళుతుంది. ఇంటి పక్కనే నివసిస్తున్న వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బాలిక తన తల్లికి తెలియజేయగా ఆమె పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్లో... పశ్చిమబెంగాల్ పూర్బ బర్దమాన్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిం ది. బస్‌స్టాండ్ వద్ద వేచి చూస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు కలసి ఆమెను అపహరించి అత్యాచారం చేశారు. బాధితురాలి పిర్యాదు మేరకు ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
విషాదం: చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
సాక్షి,చిత్తూరు: మండలంలోని విరూపాక్షపురం గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం విషాదం నింపింది. ఎస్ఐ మునిస్వామి కథనం మేరకు.. కడప జిల్లా పూలంపేట మండలంలోని టీ.జీ.వీ పల్లెకు చెందిన మల్లికార్జునకు పక్షవాతం రావడంతో బంధువుల సాయంతో విరూపాక్షపురానికి వచ్చాడు. పక్షవాతం మందు సేవించిన మల్లికార్జున కొంతసేపు అక్కడే ఉన్నాడు. అతని తోడుగా వచ్చిన వెంకటకృష్ణ (17), కార్తీక్(15) గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వెంకటకృష్ణ కాలుజారి చెరువులో పడిపోవడంతో అక్కడే ఉన్న కార్తీక్ కాపాడబోయాడు. దీంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మునిస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Payel Sarkar: నటికి ఫేక్ డైరెక్టర్ అసభ్య సందేశాలు -
గ్రామ దేవతలకు జలాభిషేకం: పట్టాల వెంట పాదయాత్రగా వెళ్తుండగా ఘోరం
సాక్షి,కర్నూలు: వరుణుడి కరుణ కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం చేసేందుకు ఊరంతా సిద్ధమవుతుండగా అంతలోనే విషాదం నెలకొంది. తుంగభద్ర జలాలు తెచ్చేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువు బారిన పడ్డారు. రాత్రి వేళ రైలు పట్టాలెంబడి పాదయాత్రగా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం బిణిగేరి గ్రామంలో ఏటా శ్రావణమాసం మూడో శనివారం గ్రామదేవతలైన అంజినయ్య స్వామి, తిక్కస్వామి, మారెమ్మవ్వ, సుంకులమ్మవ్వ, పంచలింగేశ్వరస్వామికి తుంగభద్ర జలాలతో అభిషేకం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి దాదాపు 300 మంది గ్రామస్తులు 60 కి.మీ దూరంలోని మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ సమీపంలోని నది వద్దకు చేరుకున్నారు. అక్కడ బిందెల్లో నీరు నింపుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొందరు ఆటోల్లో వెళ్లిపోగా మరి కొందరు రైలు పట్టాల వెంబడి మొక్కుబడి తీర్చుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ఐరన్‌గల్లు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పట్టాలెంబడి దాదాపు వాగుపై 200 మీటర్ల పొడవైన వంతెన ఉంది. శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వంతెన మీదుగా భక్తులు వెళ్తుండగా రాయచూర్ నుంచి ఆదోని వైపు వేగంగా రైలు వస్తుండగా అందరూ అప్రమత్తమై పట్టాలుదిగారు. కాగా ఈరన్న, ఈరమ్మ దంపతుల కుమారుడు అంజినయ్య(19), తిమ్మప్ప, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీనివాసులు (16) మాత్రం వంతెన దాటే ప్రయత్నం చేయగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండే ఇద్దరు యువకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోçస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బిణిగేరి గ్రామంలో శనివారం పండుగ వాతారణం నెలకొనా ల్సి ఉండగా ఇద్దరి యువకుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: మరో టీమ్‌కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే! -
విషాదం:కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి..
ఆ తొమ్మిది నెలల పాపకు నాన్న మరి లేడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఆదుకోవడానికి ఆ కుమారుడు ఇక రాడు. పక్షుల వేట కోసం అడవికి వెళ్లిన యువకుల బతుకులు అక్క డే తెల్లారిపోయాయి. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన తీగలే వారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. కొత్తూరు మండలంలో జరిగిన ఈ ఘటన గిరిజన గూడల్లో విషాదం నింపింది. ఎల్.ఎన్.పేట/కొత్తూరు: కొత్తూరు మండలం రాయ ల పంచాయతీ కొత్తపొనుటూరు సమీపంలో గురువారం రాత్రి సవర ఆకాష్(17), బుయా బిలియా (22) అనే ఇద్దరు యువకులు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. శుక్రవారం ఉదయం వీరి మృతదేహాలు కుటుంబ సభ్యులకు దొరికాయి. ఇందుకు సంబంధించి కొత్తూరు పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తూరు మండలం కొత్తగూడకు చెందిన సవర ఆకాష్(17), తన బంధువు ఒడిశాలోని గరబ గ్రా మానికి చెందిన బుయా బిలియా అలియాస్ విలియం(22), నాయుడుగూడకు చెందిన సవర సుశాంత్‌లతో కలిసి గురువారం సాయంత్రం దాటాక తల కు టార్చిలైట్లు కట్టుకుని సమీపంలోని కొండల్లోకి పక్షుల వేట కోసం వెళ్లారు. చీకటి పడ్డాక గూటికి చేరే పిట్టలను వేటాడడం ఇక్కడి వారికి పరిపాటి. అయి తే వేట సరిగా సాగకపోవడంతో అంతా ఇంటిదారి పట్టారు. సుశాంత్ మరో దారిలో వారి గ్రామానికి చేరుకున్నారు. ఆకాష్, బిలియా మాత్రం ఇంటికి రాలేదు. రాత్రి ఎంత సమయమవుతున్నా వారు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు సుశాంత్‌ను అడిగారు. తను మరో దారి గుండా వచ్చేశానని చె ప్పడంతో బంధువులంతా తప్పిపోయిన ఇద్దరి కో సం అడవిలో వెతకడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆకాష్ తండ్రి ఎలియోకు కొత్తపొనుటూరు కొండల సమీపంలోని పంట పొలాల్లో ఈ ఇద్దరు యువకుల మృతదేహాలను చూశారు. వారిపైనుంచి జింక్ వైర్లు ఉండటంతో అవి కాలికి తగిలి విద్యుత్ షాక్ కొట్టి యువకులు చనిపోయి ఉంటారని భావించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను పరిశీలించారు. ఈ జింక్ వైర్లు కేవలం అడవి పందులను చంపడానికి పెడతారు. దీంతో వాటిని అక్కడ పెట్టారని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిన్నంటిన రోదనలు.. మృతుల్లో ఒకరైన బిలియా ఒడిశా వాసి. ఆయనకు భార్య, తొమ్మిది నెలల పసిపాప ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త చనిపోయాడనే విషయం ఆమెకు ఎలా చెప్పాలో తెలీక స్థానికులు కంటనీరు పెట్టారు. అలాగే ఆకాష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. పై చదువులు చదువుకుని ఉద్యోగం చేసి తమను ఆదుకుంటాడని అనుకుంటే ఇలా అన్యాయం చేసి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఆకాష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను కొత్తూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పాలకొండ డీఎస్పీ శ్రావణి, కొత్తూరు సీఐ చంద్రమౌళి పరిశీలించారు. -
ఇంటి వద్ద దింపుతామని చెప్పి...
చిన్న శంకరంపేట: తెలిసిన వ్యక్తులే కదా.. అని బైక్ ఎక్కిన మహిళను ఇద్దరు యువకులు నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మహిళ(30) భర్త చనిపోవడంతో కూలిపనులు చేసుకుంటూ ఉంటుంది. చేగుంట మండల కేంద్రంలో పనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బస్సు ద్వారా రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి పని పూర్తి చేసుకొని సూరారం వెళ్లడానికి బస్టాండ్‌కు చేరుకుంది. అదే సమయంలో సూరారానికి చెందిన బాలేష్(26), నగేష్(25) అక్కడికి వచ్చి తాము కూడా ఇంటికి వెళ్తున్నామని.. బైక్ పై దించుతామని చెప్పారు. తెలిసినా వ్యక్తులే కదా అని నమ్మి వారి బైక్ ఎక్కింది సదరు మహిళ. కొద్ది దూరం వెళ్లాక బైక్ దారి మళ్లించి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. చంపేస్తామని బెదిరించి ఇంటి వద్ద దించారు. జరిగిన అఘాయిత్యం గురించి బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు గురువారం చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
మృతదేహాన్ని బైక్ కు కట్టి...
భువనేశ్వర్: సాధారణంగా ఎలాంటివారైనా మృతదేహాల పట్ల కనీస మర్యాద పాటించడం ఆనవాయితీ.... ఒకింత భయపడటం కూడా తెలిసిందే. అయితే ఒడిషాలోని నబరంగపూర్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పేదరికమో, నిర్లక్ష్యమో, తెలియదుగానీ ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకొని వెళ్లడం ఆందోళన రేపింది. వివరాల్లోకి వెళితే భారాముండా గ్రామంలో ఓ మహళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి ఉన్న ఆ మృతదేహాన్ని, బైక్ పై వెనకాల కట్టుకుని ఇద్దరు తీసుకెళుతున్న దృశ్యాలు భీతి గొల్పాయి. మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక వారు అలా చేశారా? లేక వాహనంలో తరలించేందుకు అవసరమైన డబ్బులు లేక అలా చేశారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా ఆ చుట్టుపక్కల 20కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. మృతదేహాలను తరలించేందుకు వీలుగా పేదలకోసం వీటిని అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు. కాగా ఇలాంటి సంఘటన బరంగపూర్ జిల్లాలో గతంలో కూడా చోటు చేసుకుంది. కొన్ని నెలక్రితం చాలనగూడ దగ్గర ఆత్మహత్య చేసుకున్న రైతు డెడ్ బాడీని ఇదే తరహాలో పోస్ట్ మార్టం కోసం తరలించిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. -
బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని..
భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెలికిచెర్ల శివార్లలో శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న భరత్(24) యూసుఫ్(25) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ బిజినేపల్లికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆ చెత్త సెల్ఫీ జంటను ఎట్టకేలకు విడిచిపెట్టారు!
దుబాయ్: కొత్త సంవత్సరం సందర్భంగా దుబాయ్‌లో ఓ హోటల్ తగలబడుతుండగా.. దాని ముందు తాపీగా నిలబడి సెల్ఫీ తీసుకున్న ఓ జంటకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విడుదల చేసినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ శుక్రవారం తెలిపింది. దుబాయ్ ఎమిరెట్స్ అటార్నీ జనరల్ ఎస్సాం అల్ హుమైదన్ను ఉటంకిస్తూ ప్రభుత్వ వార్తాసంస్థ డబ్ల్యూఏఎం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న 64 అంతస్తుల హోటల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. నూతన సంవత్సరం వేడుకలకు కొద్దిముందే జరిగిన ఈ ప్రమాదంతో హోటల్లోని వారు ఉరుకులు, పరుగులతో హాహాకారాలు చేశారు. ఈ సమయంలో ఓ జంట మాత్రం కాలుతున్న హోటల్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంది. 2015లో ఇదే అత్యంత చెత్త సెల్ఫీ నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే వారికి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని తెలియడంతో వదిలేశారు. అనుమతి లేకుండా సంబంధిత సంస్థలు, వ్యక్తుల ఫొటోలు తీయడం దుబాయ్‌లో నేరం. ఇందుకు అరెస్టుచేసి జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. అయితే ఆ జంటను అరెస్టు చేయడం పనిలేని వ్యవహారమని దుబాయ్ రాజకీయ పరిశీలకులు పోలీసుల చర్యను తప్పుబట్టారు. -
విడాకులు ఇప్పించాడని హత్య
బావ అన్నను హతమార్చిన యువకులు కాటేదాన్: పెళ్లైన తొమ్మిది నెలలకే తమ సోదరికి విడాకులిప్పించాడని కక్షగట్టి బావ అన్నను ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా హతమార్చారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎస్ఎన్ జావీద్ కథనం ప్రకారం... టోలిచౌకికి చెందిన ఖాదర్అలీ(40) మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని అలీనగర్‌లో ప్లాస్టిక్ వేస్టేజ్ బాటిళ్ల పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఇతని సోదరుడు హలీమ్‌కు 9 నెలల క్రితం తహనీస్తో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే హలీమ్, తహనీస్ల మధ్య మనస్పర్థలు రావడంతో హలీమ్ తన భార్యకు విడాకులిచ్చి వేరుగా ఉంటున్నాడు. హలీమ్ విడాకుల విషయంలో అతని అన్న కల్పించుకొని విడాకులు ఇప్పించాడని కక్షగట్టిన తహనీస్ సోదరులు అబ్దుల్లా, తాహెర్‌లు హలీమ్ అన్న హత్యకు పథకం పన్నారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి 11.30కి పరిశ్రమ నుంచి కారులో ఇంటికి వెళ్తున్న ఖాదర్అలీపై అబ్దుల్లా, తాహెర్‌లు దాడికి పాల్పడ్డారు. ముందస్తు పథకం ప్రకారం అతని కళ్లల్లో కారం చల్లి విచక్షణారహితంగా కత్తులు, బాటిళ్లతో దాడి చేసి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పో లీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాత్రి 12.30కి బాధితుడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులంటున్నారు. నిందితులు అబ్దుల్లా, తాహెర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు పట్టుబడితే హత్యకు గల వివరాలు తెలుస్తాయని సీఐ జావీద్ తెలిపారు. -
పరుగుపందేలకు వచ్చారు ప్రాణాలు వదిలారు
సాక్షి, ముంబై: పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించుకోవాలని గంపెడాశతో ముంబైకి వచ్చిన ఇద్దరు యువకులు తమ కల నెరవేరకుండానే పైలోకానికి వెళ్లారు. మైదానంలో నిర్వహించే పరీక్షలు ఎంతో కఠినమైనప్పటికీ ఉద్యోగం సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఇంటర్వ్యూ కోసం ముంబైకి వచ్చి విగత జీవులయ్యారు. బుధవారం విక్రోలిలోని కన్నంవార్ మైదానంలో పరుగు తీస్తుండగా మార్గమధ్యలోనే ఒక యువకుడు కుప్పకూలిపోయాడు. మరో అభ్యర్థి ఇలాగే ఆదివారం ఏరోలిలోని పట్నీగ్రౌండ్లో పరుగులు తీస్తుండగా స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వాషిలోని కార్పొరేషన్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. వీరిని మాలేగావ్ నుంచి వచ్చిన అంబాదాస్ సోనావణే (23), విరార్‌కు చెందిన ప్రసాద్ మాలీ (19)గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ సాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన తరువాత అర్హులైన అభ్యర్థులను దశల వారీగా ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. అందులో భాగంగా నగరం, శివారు ప్రాంతాల్లో ఈ నెల ఆరో తేదీ నుంచి వేర్వేరు మైదానాల్లో శారీరకదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాగా ఎండ ఉండడంతోపాటు ఐదు కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉండడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోతున్నారు.