ఇంటి వద్ద దింపుతామని చెప్పి...
Published Thu, Oct 6 2016 2:51 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
చిన్న శంకరంపేట: తెలిసిన వ్యక్తులే కదా.. అని బైక్ ఎక్కిన మహిళను ఇద్దరు యువకులు నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మహిళ(30) భర్త చనిపోవడంతో కూలిపనులు చేసుకుంటూ ఉంటుంది. చేగుంట మండల కేంద్రంలో పనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బస్సు ద్వారా రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి పని పూర్తి చేసుకొని సూరారం వెళ్లడానికి బస్టాండ్‌కు చేరుకుంది.
అదే సమయంలో సూరారానికి చెందిన బాలేష్(26), నగేష్(25) అక్కడికి వచ్చి తాము కూడా ఇంటికి వెళ్తున్నామని.. బైక్ పై దించుతామని చెప్పారు. తెలిసినా వ్యక్తులే కదా అని నమ్మి వారి బైక్ ఎక్కింది సదరు మహిళ. కొద్ది దూరం వెళ్లాక బైక్ దారి మళ్లించి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. చంపేస్తామని బెదిరించి ఇంటి వద్ద దించారు. జరిగిన అఘాయిత్యం గురించి బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు గురువారం చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement