ఆసిఫా కుటుంబానికి న్యాయం చేయాలి | Kathua rape victim's family should get justice | Sakshi
Sakshi News home page

ఆసిఫా కుటుంబానికి న్యాయం చేయాలి

Published Thu, Apr 19 2018 1:50 PM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

Kathua rape victim's family should get justice - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌ విద్యార్థి నాయకులు

హత్నూర(సంగారెడ్డి): జమ్ముకాశ్మీర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఉమ్మడి మెదక్‌ జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి.నరేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రమైన హత్నూరలో మాట్లాడుతూ... సభ్య సమాజం సిగ్గుపడేలా ముక్కు పచ్చలారని చిన్నారిపై  అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు.

రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతుండటం దారుణమన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దుండగులకు ఉరిశిక్ష వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనతో పాటు  వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి నాయకులు రాజు, అనిల్, ప్రకాశ్, నవీన్, శంకర్‌ తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement