![Two Men Died Due To Kites And China Manza In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/14/Kites-Hyderabad.jpg.webp?itok=PL2CxHQU)
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ పూట గాలిపటాల సరదా రాజధాని నగరంలో ఇద్దరి ప్రాణాలు తీసింది. రోడ్డుపై వెళుతూ చైనా మాంజా దారం తగిలి ఆర్మీ లో డ్రైవర్‌గా పని చేసే కోటేశ్వేర్ రెడ్డి మృతి చెందాడు. మరో ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ అల్వాల్ పీఎస్‌లో పనిచేసే ఏఎస్సై కుమారుడు ఆకాష్ ఇంటిపై నుంచి కిందపడి మరణించాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.
శనివారం సాయంత్రం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌజ్‌స్ ఫ్లైఓవర్‌పై అడ్డుగా ఉన్న చైనా మాంజా మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటేశ్వర్‌రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వేరే ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవశాత్తు భవనం పైనుండి పడి ఆకాష్(20) అనే యువకుడు మృతి చెందాడు. పేట్ బహీరాబాద్‌లో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆకాష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సహచర ఉద్యోగి కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసుస్టేషన్‌లోలోనూ విషాద చాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment