
( ఫైల్ ఫోటో )
సాక్షి,చిత్తూరు: మండలంలోని విరూపాక్షపురం గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం విషాదం నింపింది. ఎస్‌ఐ మునిస్వామి కథనం మేరకు.. కడప జిల్లా పూలంపేట మండలంలోని టీ.జీ.వీ పల్లెకు చెందిన మల్లికార్జునకు పక్షవాతం రావడంతో బంధువుల సాయంతో విరూపాక్షపురానికి వచ్చాడు.
పక్షవాతం మందు సేవించిన మల్లికార్జున కొంతసేపు అక్కడే ఉన్నాడు. అతని తోడుగా వచ్చిన వెంకటకృష్ణ (17), కార్తీక్(15) గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వెంకటకృష్ణ కాలుజారి చెరువులో పడిపోవడంతో అక్కడే ఉన్న కార్తీక్ కాపాడబోయాడు. దీంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మునిస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment