CHITTURU
-
40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం
ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్‌లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది. కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది. చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
-
ట్రెండింగ్‌గా మారిన అశ్విని.. మరోసారి 23 సెంటిమెంట్
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఒక్కసారిగా అశ్వినీ పేరు మార్మోగిపోతోంది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అశ్వినీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 1989 నుంచి ఇక్కడ టీడీపీ పార్టీనే వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి స్థానంలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరిగింది. మరోసారి తెరపైకి 23 వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్‌లో 23 నంబర్‌కి ప్రత్యేకత ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. అందులో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. తాజాగా కుప్పంలో టీ సద్దుమూరు స్థానం నుంచి విజయం సాధించి వెలుగులోకి వచ్చిన అశ్విని వయస్సు కూడా 23 ఏళ్లే కావడం గమనార్హం. దిష్టి గట్టిగా తీయండమ్మా !! ఆ పాపిష్టి కళ్ళు అన్ని ఈ అమ్మాయి మీదే ఉన్నాయి ! pic.twitter.com/Ka7lCYwlh5 — Ram (@iamSidde) September 19, 2021 -
పరుగులు తీసి.. ప్రాణం కాపాడి..
సాక్షి,చిత్తూరు(రేణిగుంట): ఏ కష్టమొచ్చిందో ఆ వృద్ధురాలికి ప్రాణాలు తీసుకోవాలనుకుంది.. ఆగి ఉన్న గూడ్సు కింద పట్టాలపై తలపెట్టి పడుకుంది.. అదే సమయంలో రైలు కదిలేందుకు సిగ్నల్ పడింది.. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన రైల్వే పోలీసులు పరుగులు పెట్టారు.. పట్టాలపై నుంచి వృద్ధురాలిని పక్కకు లాగి కాపాడారు. ఆర్పీఎఫ్ సిబ్బందిని ఉరుకులు పెట్టించిన ఈ ఘటన ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్లో జరిగింది. జీఆర్పీ ఎస్ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు.. రేణిగుంట బాలాజీ కాలనీకి చెందిన వరదరాజులు భార్య పాండియమ్మ(76) సాయంత్రం 6.30గంటల సమయంలో రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఐదో నంబర్ ప్లాట్‌ఫామ్ చివరకు వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ కింద తలపెట్టింది. ఈ విషయం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సీసీ కెమెరాలో గమనించారు. వెంటనే ఆయన జీఆర్పీ స్టేషన్ సమాచారం అందించారు. అప్పటికే రైలుకు సిగ్నల్ పడడంతో ఎస్ఐ అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి పరుగుపరుగున పట్టాలపై పడుకున్న వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమెను బలవంతంగా పక్కకు లాగేయడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. వృద్ధురాలిని కాపాడిన కొద్దిక్షణాల్లోనే రైలు కదలింది. అనంతరం రైల్వే పోలీసులు పాండియమ్మ వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలితో ఇంటికి పంపించారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
పాపం.. పసిహృదయాలు!
విధి ఆడిన వింతనాటకంలో.. తల్లిదండ్రులు దూరమై ఇద్దరు పిల్లలు వీధినపడిన ఘటన కేవీబీపురం మండలం, తిమ్మసముద్రం గ్రామంలో మంగళవారం కలచివేసింది. గత ఏడాది కరోనా మహమ్మారికి తండ్రి బలవ్వగా, ఇప్పు డు గుండె పోటుతో తల్లి దూరమవ్వడం ఆ చిన్నారులకు తీరని వేదనను మిగిల్చింది. నా అన్న వాళ్లు లేక.. తమ కాళ్లపై తాము నిలబడలేక తల్లడిల్లితున్న ఆ పసిహృదయాలను చూసి పలువురు కంటతడి పెట్టడం కనిపించింది. సాక్షి,చిత్తూరు: మండలంలోని తిమ్మసముద్రం గ్రా మానికి చెందిన ప్రతాప్‌రెడ్డి(48), సుగుణ(44) భా ర్యభర్తలు. వీరికి కుశి్మతా(17), నితీష్ సంతానం. మూడేళ్ల కిందట వరకు కిడ్నీ వ్యాధితో ప్రతాప్‌రెడ్డి వారంవారం డయాలసిస్ చేయించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్‌తో వైద్య ఖర్చులు పోను అంతోఇంతో కూడబెట్టి పిల్లల చదువుకు ఉపయోగించేవాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న వేళ గత ఏడాది కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. కుటుంబ పెద్దను పొట్టబెట్టుకుంది. అప్పటి వరకు లోకం తెలియని ఆ ఇల్లాలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుబాటులో ఉన్న కూలిపనులకు వెళ్లి బిడ్డలకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని నిశ్చయించుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు మాడ్చుకుని పిల్లలకు తండ్రి లేనిలోటు లేకుండా చదివించింది. ఇలాంటి తరుణంలో మంగళవారం సుగుణకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంటివద్దే ప్రాణాలు వదిలింది. పెద్దగా బంధువులు కూడా లేకపోవడంతో ఎవ్వరూ దగ్గరకు రాలేదు. అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియక ఆ పసిహృదయాలు తల్లడిల్లిపోయాయి. తల్లి మృతదేహం వద్దే దిగాలుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో స్థానికులు చేయిచేయి కలిపి వారికి అంతిమయాత్రను కొనసాగించారు. ఇద్దరు పిల్లల చేత తల్లికి తలకొరివి పెట్టించారు. వీధినపడిన పిల్లలను ప్రభుత్వం అక్కున చేర్చుకుని చదివించాలని స్థానికులు కోరుతున్నారు. -
విషాదం: చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
సాక్షి,చిత్తూరు: మండలంలోని విరూపాక్షపురం గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం విషాదం నింపింది. ఎస్ఐ మునిస్వామి కథనం మేరకు.. కడప జిల్లా పూలంపేట మండలంలోని టీ.జీ.వీ పల్లెకు చెందిన మల్లికార్జునకు పక్షవాతం రావడంతో బంధువుల సాయంతో విరూపాక్షపురానికి వచ్చాడు. పక్షవాతం మందు సేవించిన మల్లికార్జున కొంతసేపు అక్కడే ఉన్నాడు. అతని తోడుగా వచ్చిన వెంకటకృష్ణ (17), కార్తీక్(15) గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వెంకటకృష్ణ కాలుజారి చెరువులో పడిపోవడంతో అక్కడే ఉన్న కార్తీక్ కాపాడబోయాడు. దీంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మునిస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Payel Sarkar: నటికి ఫేక్ డైరెక్టర్ అసభ్య సందేశాలు -
గుజరాత్ యువతితో చిత్తూరు టెకీ ప్రేమ పెళ్లి.. రక్షణ కల్పించాలంటూ
సాక్షి, మదనపల్లె : తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని శనివారం మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులను ఓ ప్రేమజంట ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రంగారెడ్డి వీధిలో కాపురం ఉంటున్న విజయ్‌కుమార్ కొడుకు పి.కృషవ్ (27) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలోనే పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన బహదూర్ సింగ్ కుమార్తె శివాని (25), కృషవ్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ఆ ప్రేమికులు రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చి కురబలకోట మండలం చేనేతనగర్‌లో ఉండే ఓ ఆలయంలో స్నేహితుల సహకారంతో వివాహం చేసుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. చదవండి: పట్టాలెంబడి పాదయాత్రగా తిరిగి వస్తుండగా ఢీకొన్న రైలు -
బాగోతం బట్టబయలు.. అమరరాజా ఆటకట్టు..
వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒక్కటే అన్నట్లుగా సాగింది గతంలో అమరరాజా వ్యవహారం. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా అటవీ శాఖ భూముల్లో పాగావేసింది. అనుమతి తీసుకున్న భూమిని కాదని.. పక్కనున్న స్థలాన్నీ కలిపేసుకుంది. ఎంచక్కా గోడ కట్టేసినా.. పెద్దలతో వ్యవహారంతో కావడంతో అధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ బాగోతం కాస్తా బట్టబయలు కావడంతో అధికారుల్లోనూ చలనం వచ్చింది. చర్యలకు సిద్ధమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అనధికార ప్రహరీని కూల్చేసి.. ఆక్రమిత స్థలాన్ని స్వాదీనం చేసుకోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో ‘అమరరాజా’ యాజమాన్యం 2000 సంవత్సరంలో తమ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సమీప అటవీ శాఖ(ఫారెస్ట్ పోరంబోకు) భూమిని భూ మార్పిడి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఆ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో 4.4 హెక్టార్ల అటవీభూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమరరాజాకు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం 4.4 హెక్టార్లకు అనుమతిస్తే.. ఫ్యాక్టరీ యాజమాన్యం మరో 3.04 హెక్టార్లను ఆక్రమించేసింది. ఏకంగా ఆ అటవీ భూముల్లోనే ప్రహరీ కట్టేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు ఏడున్నర ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా ఆక్రమించేసింది. ఇలా సుమారు రెండు దశాబ్దాలుగా అటవీభూమిని ఆక్రమించుకున్నా ఎవ్వరూ సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. అమరరాజా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విష కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో అమరరాజా వివాదాల తుట్టె ఈ మధ్యకాలంలో కదలడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జూలై 20న ‘సాక్షి’లో ‘అటవీభూముల్లో అమరరాజా’ శీర్షికన వచ్చిన కథనంపై అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తొలుత ఆయా భూముల్లో ఆక్రమిత గోడను తొలగించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి అక్రమిత భూమిలోని ప్రహరీని కూల్చేశారు. అమరరాజా కలిపేసుకున్న ఆ మూడు హెక్టార్ల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నామని తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో) పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఆ 18 ఎకరాలూ అటవీభూములే.. అమరరాజా భూ ఆక్రమణలకు సంబంధించి తాజాగా అటవీశాఖ అధికారులు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీస్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ పరిధిలో 18 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫైడ్ గెజిట్ ప్రకారం అవి కచ్చితంగా అటవీ శాఖ భూములేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో 2015–16 మధ్య కాలంలో కరకంబాడి పంచాయతీ పరిధిలోనే 21 ఎకరాల భూములను అమరరాజా యాజమాన్యం కొనుగోలు చేసింది. 1982లో పేదల కోసం అసైన్ చేసిన ఆ భూములను అడిగిందే తడవుగా ఆరేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం అలినేషన్ పేరిట అమరరాజాకు విక్రయించింది. అయితే ఈ 21 ఎకరాల భూముల్లో 18 ఎకరాలు అటవీ భూములేనని, 1979లో నోటిఫై చేసిన అటవీ భూములను రెవెన్యూ అధికారులు ఎలా విక్రయిస్తారని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు భూముల పూర్తి వివరాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. వాస్తవానికి గతంలో అవి అటవీ భూములేనని, అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ నేపథ్యంలో డీనోటిఫైగా చూపిస్తున్నాయనేది రెవెన్యూ అధికారుల వాదన. అయితే ఆ భూమి ఎప్పుడు, ఎందుకు డీనోటిఫై చేశారో వివరాలు అందుబాటులో లేవని చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఆ సర్వేతోనైనా 18 ఎకరాల అటవీ భూముల అసలు ‘కథ’ బయటికొస్తుందో లేదో చూడాలి. -
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు..
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఆ పార్టీ అనుబంధ కమిటీల నియామకం చిచ్చు రేపింది. స్థానిక టీడీపీ ఇన్చార్జుల తీరును ఎండగడుతూ అధినేతకు నాయకులు లేఖలు రాయడం మొదలుపెట్టారు. వలస నేతలకు పదవులు కట్టబెట్టడంతో ఆశావహులందరూ అసంతృప్తితో రగిలిపోతూ లేఖల యుద్ధానికి దిగారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలు కొందరు వైఎస్సార్ సీపీలో చేరిపో యిన వైనంపై స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి లేఖల ద్వారా తీసుకెళుతున్నారు. సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల నియామకాలపై జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలా ఐతే మా వల్ల కాదు బాబు గారూ’ అంటూ అధినేత చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కొట్టాలకు చెందిన రవినాయుడును తిరుపతి కోటాలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షుడిగా నియమించారు. రవి నాయుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ, ఎస్వీ యూనివర్సిటీలో మాస్ కాపీయింగ్‌లో పట్టుబడిన వ్యక్తి అని తిరుపతికి చెందిన టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు బంధువునని, లోకేష్ బాబు బామ్మర్ది అని, తాను చెప్పిన వారికే పదవులు వస్తాయని చెప్పుకుంటూ.... జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపైన పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయనపై టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు లేఖ రాశారు. పుంగనూరుకు చెందిన ఆనంద్ గౌడ్‌కి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇతనికీ తిరుపతి కోటాలోనే పదవిని కట్టబెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో టీడీపీ యువ నాయకులే లేరా అని లేఖలో నిలదీశారు. ఈ పరిణామం తిరుపతి నగర టీడీపీకే అవమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు ఇన్చార్జ్ పదవిని దొరబాబు తిరస్కరించినట్లు తెలిసింది. చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని చిత్తూరు ఇన్చార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. వాళ్లదే పెత్తనం పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెలో నియోజకవర్గ ఇన్చార్జులు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, దొమ్మల పాటి రమేష్, శంకర్‌యాదవ్ తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు వారి అనుచరులను మాత్రం పిలిపించుకుంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కనపెట్టి, వలస నేతలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో టీడీపీ శ్రేణుల్లో ముఖ్యనేతలందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఇన్చార్జ్ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరిపోవడంతో టీడీపీ డీలాపడిపోయింది. ఈ పరిస్థితుల్లో టీడీపీని బతికించుకునేందుకు ఉన్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు, లోకేష్ వద్దంటూ, జూనియర్ ఎన్టీఆర్‌కి జై కొడుతూ జెండాలు ఎగురవేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను ఆయా నియోజకవర్గ నాయకులు చంద్రబాబుకు ఎవరికి వారు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ కుమ్ములాటలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులకూ అన్ని ప్రభుత్వ పథకాలు అందుతుండడంతో సామాన్య కార్యకర్తలు ఎక్కువమంది వైఎస్సార్సీపీకి జై కొడుతున్నారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ గాలి భానుప్రకాష్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో లేరనే విమర్శలున్నాయి. అధికార పార్టీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్కే రోజా, వరుస విజ యాలతో దూసుకుపోతుండగా, టీడీపీ ఇన్చార్జ్ కేడర్‌ను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన టీడీపీ శ్రేణులు అనేక మంది ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో పార్టీలో చేరిపోతున్నారు. దీంతో ఉన్న కొద్ది మంది టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. సత్యవేడులో మాజీ ఎమ్మె ల్యే హేమలత, జేడీ రాజశేఖర్ ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమ నార్హం. అధికారం కోల్పోయాక మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య నియోజకవర్గానికి రావడమే మానేశారు. దీనిపైనా టీడీపీ శ్రేణులు అధిష్టానానికి లేఖల ద్వారా మొరపెట్టుకుంటున్నారు. చదవండి: పోలీసుల మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
శ్రీకాళహస్తిలో నవరత్న నిలయం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి నవరత్నాల నిలయాన్ని నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను కళ్లకు కట్టినట్టు నిర్మించారు. నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. నిలయం మధ్యలో జగన్ ఫొటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను రూపొందించారు. అద్దాల గోపురంలో జగనన్న నిలయంపైన ప్రత్యేకంగా అద్దాల గోపురం నిర్మించారు. మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రాగి ఆకుల్లో సీఎం జగన్ బొమ్మను చిత్రీకరించారు. అద్దాల గోపురంలోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్ జగన్ ఫొటోలు కనిపిస్తాయి. నిలయం నిర్మాణానికి ప్రత్యేక నిపుణులు నవరత్నాల నిలయం కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెప్పించారు. నవరత్నాల నిలయం ప్రారంభం అనంతరం 2,500 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. -
తెలుగు గడ్డపై హీరో మోటర్ కార్ప్ గిన్నీస్ రికార్డ్
World's Largest Motorcycle Logo: ప్రపంచంలోనే అతి పెద్ద బైకుల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటర్ కార్ప్ మరో రికార్డు సాధించింది. ఆ కంపెనీకి చెందిన 100 మంది సిబ్బంది 90 రోజుల పాటు శ్రమించి హీరో పేరును గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించారు. తెలుగు నేలను వేదికగా హీరో సంస్థ ఈ ఘనత సాధించింది. చిత్తూరులో హోండా కంపెనీ నుంచి హీరో విడిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని హీరో అరుదైన కార్యక్రమం చేపట్టింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాను వేదికగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్ సైకిల్ లోగోను ఏర్పాటు చేసి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. గిన్నీస్ రికార్డ్ చిత్తూరులో ఉన్న హీరో మోటార్ కార్ప్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్ప్లెండర్ ప్లస్ బైకులను హీరో లోగో ఆకారంలో ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ సమీపంలో నేలను చదును చేశారు. ఆ తర్వాత హీరో లోగో ఆకారంలో రోజుకు కొన్ని బైకులను పార్క్ చేశారు. దీని కోసం హీరోకు చెందిన వంద మంది సిబ్బంది 90 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. ఈ లోగో ఆకారంలో 1845 బైకులను నిలిపి ఉంచారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని షూట్ చేసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకు పంపించారు. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం లార్జెస్ట్ మోటార్ సైకిల్ లోగోగా గిన్నీస్ గుర్తించింది. పదికోట్ల బైకులు హీరో కంపెనీ నుంచి పది కోట్ల బైకులు అమ్మడంతో పాటు హీరో పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్టు హీరో మోటార్ కార్ప్ గ్లోబల్‌హెడ్ మాలో ఏ మాసన్ తెలిపారు. ఈ లోగో ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఆగస్టు 9న హీరో రిలీజ్ చేసింది. - సాక్షి, వెబ్‌డెస్క్ What happens when 100 brilliant minds come together? A world record is made. With 90 days of planning and 300 hours of dedication. Watch the video to know more. pic.twitter.com/QAdK4CijUO — Hero MotoCorp (@HeroMotoCorp) August 10, 2021 -
అన్లోడ్ చేస్తుండగా టిప్పర్‌కి విద్యుదాఘాతం..ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ లోడ్ ను అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ ముందుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతని రక్షించడానికి వెళ్లిన దొరబాబు, జ్యోతిష్కులు కూడా అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
రహదారులకు ‘పచ్చ తోరణం’
సాక్షి,చిత్తూరు: జిల్లాలోని రహదారులు పచ్చ తోరణంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుడుతోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేందుకు నిర్ణయించింది. మొక్కను నాటినప్పటి నుంచి చెట్టయ్యే వరకు సంరక్షించేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తిరుపతి మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లాలో 6,10,510 మొక్కలను 15 రోజుల్లో నాటేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రహదారులకు ఇరువైపులా 1,526.28 కిలోమీటర్ల వరకు మొక్కలను నాటుతారు. ఆగస్టు ఒకటి నుంచి 15లోపు మొక్కలు నాటడం పూర్తికాకుంటే మరోవారం రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. మొక్కకు రూ.385 ఖర్చు ఉపాధి హామీ పథకం నిధులతో ‘జగనన్న పచ్చతోరణం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాటే మొత్తం మొక్కలకు రూ.23,50,46,350 ఖర్చు చేయనున్నారు. ఒక్కో మొక్కకు ఏడాదికి రూ.385 ఖర్చు చేస్తారు. చిన్న మొక్కలను నాటితే త్వరగా ఎదిగే అవకాశం లేదని గుర్తించిన ప్రభుత్వం ఒక్కో మొక్క 6 నుంచి 10 అడుగుల ఎత్తు, రెండేళ్ల వయసు కలిగినవి నాటేందుకు నిర్ణయించింది. ఒక మొక్క కొనుగోలుకు రూ.95, నాటడానికి రూ.110, క్రిమిసంహారక మందు పిచికారీకి రూ.10, నెలకు నిర్వహణ రూ.10, నీటికి రూ.20, ఫెన్సింగ్‌కు రూ.140 చొప్పున మొత్తం రూ.385 ఖర్చు చేస్తారు. లక్ష మొక్కలు సిద్ధం పచ్చతోరణం పక్షోత్సవాలకు జిల్లాలో లక్ష మొక్కలను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన మొక్కలను దశలవారీగా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజమండ్రితో పాటు తమిళనాడులోని పుదుకోట్టై నుంచి మొక్కలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి నిర్దేశించిన ప్రణాళిక మేరకే కాకుండా అదనంగా మరో లక్ష మొక్కలు నాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా తంబళ్లపల్లెలో ప్రారంభం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ఈ పచ్చతోరణాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్డుపక్కన మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టారు. రాజమండ్రి నుంచి తెప్పించిన మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటి సంరక్షించే పనులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. -
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు..
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు.. ప్రసవం చేస్తే వేలకు వేలు గుంజేస్తున్నారు.. సొమ్ము ఇవ్వలేని నిరుపేదలను నీచంగా చూస్తున్నారు.. మాటలతోనే మనసును కుళ్లబొడుస్తున్నారు.. మానవత్వం మరిచి.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిబ్బందే, రాబందులై ప్రజలను పీక్కుతింటున్నారు. చిత్తూరు రూరల్: చిత్తూరు నగరంలోని జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం అధిక సంఖ్యలో పేదలే వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడువాసులు కూడా ప్రసవం కోసం ఇక్కడికే వస్తుంటారు. రోజుకు సగటున 25 నుంచి 30 కేసులు డెలివరీ కోసం వస్తుంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అదేపనిగా డబ్బులు దండుకుంటున్నారు. వసూళ్లు ఇలా.. ప్రసూతి విభాగంలో ఉదయం, రాత్రి, అత్యవసరమైతే మధ్యాహ్న వేళల్లో ప్రసవం కోసం ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇక్కడ సిబ్బందిలో కొందరు బిడ్డను చూపించిన వెంటనే కాసులు అడుగుతున్నారు. అది కూడా రూ.1000 లేదా రూ.2000 అనుకుంటే పొరబాటే. ఏకంగా రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణులు, తమిళనాడు వాసులను టార్గెట్ చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆపరేషన్ అయిన వెంటనే బెడ్‌పైకి మార్చాలని, క్లీనింగ్ పేరు చెప్పి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. పురిటినొప్పులే నయం.. చిత్తూరు ఆస్పత్రికి ప్రసవానికొచ్చే వారికి పురిటినొప్పుల కంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది తీరుతో పడే ఇబ్బందులే అధికం అంటే అతిశయోక్తి కాదేమో. వారు అడిగిన డబ్బులిస్తే పని చేస్తారు. లేకుంటే డబ్బు కోసం పీడిస్తారు. ఇచ్చే వరకు దుర్భాషలాడుతారు. ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేనివాళ్లు ఎందుకొచ్చారంటూ.. తీవ్రంగా అవమానిస్తారు. డబ్బులిచ్చే వరకు జలగల్లా పట్టుకుంటారు. వారిని అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. ►4 పలమనేరుకు చెందిన కోకిల(19) కాన్పు కోసం తమిళనాడులోని వేలూరులో అరుకంబడి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో గతవారం చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇక్కడ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డ జన్మించింది. అయితే బిడ్డను చేతిలో పెట్టగానే ఆస్పత్రి సిబ్బంది కోకిల తల్లిని రూ.20 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.10 వేలు గుంజేశారు. బిడ్డను ఏమైనా చేస్తారేమో అని భయపడి డబ్బు ఇచ్చామని బాధితురాలు కంటతడి పెట్టింది. ►4 తిరుత్తణికి చెందిన అనిత(25) ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరి, ఆదివారం డిశ్చార్జ్ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యుల వద్ద కూడా సిబ్బంది రూ.10 వేలు లాగేశారు. అడిగినంత ఇస్తేనే.. మీ బిడ్డను బయటకు తెస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మాత్రం ఇవ్వలేని వారు మీకెందుకు బిడ్డలంటూ హేళన చేశారు. బాధితులు చేసేది లేక అప్పుచేసి.. వారికి అడిగినంతా ముట్టజెప్పారు. -
హైటెక్ "కాల్" కేయులు: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌గా మార్చి..
సాక్షి,తిరుపతి క్రైం: తిరుపతి కేంద్రంగా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నెట్‌వర్క్‌ల ఆదాయానికి గండికొట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్‌కుమార్ తెలిపిన వివరాలు..అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి కొందరు సంస్థకు నష్టం కలిగిస్తున్నట్లు దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ టెలికం సంస్థ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేసరికి హైటెక్ ‘కాల్స్’ కేటుగాళ్ల బండారం బట్టబయలైంది. వీరికి టెలికాం సంస్థలో పనిచేస్తున్న కొందరు మార్కెటింగ్ అధికారులు సహకరించినట్లు తేలింది. ఎలా చేశారంటే.. ఫోన్ వినియోగదారులకు తెలియకుండా వందల సంఖ్యలో వారి ఆధార్ కార్డులతో అక్రమంగా సిమ్ కార్డులు పొందారు. ఈకేవైసీ సరిగా పడలేదని ఎన్నోసార్లు వేలిముద్రలు వేయించారు. ఆ తర్వాత ఓటీపీ ద్వారా నగరంలోని కస్టమర్ల నుంచి నాలుగు నుంచి పది వరకు అక్రమంగా సిమ్ కార్డులు పొంది అక్రమాలకు తెరలేపారు. ఇలా పొందిన సిమ్‌లతో విదేశాల నుంచి +91 ఇన్కమింగ్ లోకల్ కాల్స్ ద్వారా మళ్లించి అధిక ఆదాయం పొందేవారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇలా చేస్తుండడంతో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, వివిధ ప్రైవేటు సంస్థల సెల్యులర్ నెట్వర్క్ సంస్థల ఆదాయానికే కాకుండా ప్రభుత్వానికి జీఎస్టీ, టాక్స్‌ల రూపంలో తీవ్రం నష్టం వాటిల్లింది. టెలికం సంస్థ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కాల్స్ కూపీ లాగితే డొంక కదిలింది. ఏక కాలంలో వివిధ ప్రాంతాల్లో దాడిచేసి సుమారు 1000 సిమ్ కార్డులు, డిన్‌స్టార్ గేట్‌వే 64, సీపీయూ, ల్యాప్‌టాప్, మొబైల్, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కన్నం రవికుమార్, తిరుపతిలో నివసిస్తున్న హరిప్రకా‹Ù, నీలం కిరణ్‌కుమార్, శేషాఫణి, నారాయణ పార్థసారథి, ఓరుగొండ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. దీనికంతా వీరే సూత్రధారులని తేలింది. వీరంతా ఎంబీఎ, బీటెక్, డిగ్రీ చదివిన వారే. వీఓఐపీ టెక్నాలజీ సాయంతో వీరు అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి వినియోగదారులకు కనెక్టివిటీ ఇచ్చి పెద్దమొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు ఈ కేసులో ఉగ్రవాదుల ప్రమేయం ఉందా? అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణకు పూనుకుంటున్నారు. నిబంధనలు పాటించని సిమ్ కార్డు డీలర్లు, సంస్థలను గుర్తించి లీగల్ నోటీసులు ఇస్తామని టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్‌కుమార్ తెలిపారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ పాల్గొన్నారు. -
మేమిద్దరం చనిపోతున్నాం..సెల్ఫీ వీడియో వైరల్..!
సాక్షి,కదిరి: ఓ ప్రేమ జంట బుధవారం కదిరి ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు కావడంతో అప్రమత్తమైన ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు కదిరి డీఎస్పీ భవ్యకిశోర్, పోలీసులు వారి ఆచూకీ కనుగొని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారు పురుగుల మందు కలిపిన స్ప్రైట్ బాటిల్ పడేసి, పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ప్రేమజంట పోస్టు చేసిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ‘నా పేరు శివప్రత్యూష, నాకు 18 ఏళ్లు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి గ్రామం. నా ప్రియుడితో కలిసి నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు నాకు 18 ఏళ్లకు రెండు నెలలు తక్కువగా ఉండేది. అప్పుడు మేము పెళ్లి చేసుకోవడానికి నా వయసు అడ్డంకిగా మారింది. అందుకే మా తల్లిదండ్రులు అక్కడ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టినట్లు తెలిసింది. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లినా మళ్లీ మా తల్లిదండ్రులు మమ్మల్ని విడదీయడం ఖాయం. అందుకే స్ప్రైట్ బాటిల్లో పురుగుల మందు కలుపుకుని తాగేసి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాం’ అంటూ ఆ యువతి మాట్లాడుతుంటే... ఇరువురూ కనబడే విధంగా ఆ బాటిల్‌ని పైకెత్తి గుటగుట తాగడం ఆమె ప్రియుడు సెల్ఫీ వీడియో తీసి సామాజిక మా«ధ్యమాల్లో పోస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న వారి కోసం సీఐ నిరంజన్‌రెడ్డి, సిబ్బంది గాలిస్తున్నారు. -
నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి : నకిలీ పట్టాలతో నిరుపేదలకు కుచ్చుటోపీ
ఓట్ల కోసం విలువలను వదిలేశారు.. ఇంటి స్థలం కోసం ఆశపడిన నిరుపేదలను నకిలీ పట్టాలతో నయవంచన చేశారు.. పేదలకు ఇచ్చినట్లు చూపిన భూములను టీడీపీ నేతలే కబ్జా చేసుకున్నారు. అడుగులకు మడుగులొత్తే అనుచరులకు మాత్రం రూ.కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టేశారు.. ఇదేమని ప్రశ్నించిన వారికి బురద అంటించేందుకు ప్రయతి్నస్తున్నారు.. వాస్తవాలను తొక్కిపెట్టి గోబెల్స్ ప్రచారానికి తెరతీస్తున్నారు.. టీడీపీ హయాంలో పీలేరు నియోజకవర్గంలో బట్టబయలైన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అండ్ కో అవినీతి అక్రమాలను చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. సాక్షి, తిరుపతి: గత టీడీపీ ప్రభుత్వంలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పీలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా పెత్తనం చెలాయించారు. అనుచరులతో కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వందలాది ఎకరాలను ఆక్రమించుకున్నారు. చెరువు, కుంట, కాలువ, పోరంబోకు భూములను యథేచ్ఛగా కబ్జా చేశారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ఇంటి పట్టాలను నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తన అనుచరులు 500 మందికి కట్టబెట్టారు. అదే సమయంలో నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని సుమారు 10వేల మంది నోట్లో మట్టికొట్టారు. ఇంటి స్థలాలు ఇస్తామని ఆశచూపి తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో కొందరు రెవెన్యూ సిబ్బంది సాయంతో నకిలీ పట్టాలను సృష్టించారు. ఓట్ల కోసం కక్కుర్తి పడి వందలాది మంది పేదలకు పంచి ఈ నకిలీ పట్టాలను పెట్టేశారు. ఈ క్రమంలోనే ఆర్థిక స్థోమత ఉన్న వారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసుకుని నకిలీ పట్టాలు అంటగట్టేశారు. ఆ పట్టాల్లో ఉన్న సర్వే నంబర్లలో ఉన్న స్థలం పట్టణంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. దీంతో లబి్ధదారులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారు. అక్రమాలు వెలుగులోకి.. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ, జర్నలిస్టు కాలనీ, రజకుల కాలనీ, ఎన్టీఆర్ కాలనీలో సుమారు 200 నకిలీ పట్టాలు బయటపడ్డాయి. తమకు పట్టా ఇచ్చినా స్థలం చూపించలేదని బాధితులు తహసీల్దార్‌ను కలవడంతో వాస్తవం వెలుగు చూసింది. దీనిపై 22 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేవలం ఆరు కాలనీల్లోనే ఈ స్థాయిలో నకిలీ పట్టాలు ఉంటే, మొత్తం నియోజకవర్గంలో ఇంకెన్ని ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అండ్ కో సాగించిన ఆక్రమణల పర్వంపై గతంలోనే ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నల్లారి భూదందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండడం గమనార్హం. -
రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి..అంతలోనే!
సాక్షి, కురబలకోట :రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తల్ల్లడిల్లిపోయారు. అసలే నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. తన కొడు కు మాత్రం తమలా కష్టపడకూడదని, ఇంజినీరింగ్ చదివించారు. కోర్సు అయిపోయిందని, త్వరలోనే ఇంటికొస్తానని కొడుకు చెప్పడంతో ఆ పేద తండ్రికి కాస్త ఊరట కలిగింది. అంతలోనే కొడుకు చావు కబురు రావడంతో గుండెలుపగిలేలా రోదించారు. ఈ సంఘటన శుక్రవారం కురబలకోట మండలం అంగళ్లులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన రామచంద్రుడు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజీవ (21), చిన్న కుమారుడు సతీష్(15). రామచంద్రుడు గౌడౌన్లో హమాలీగా పనిచేస్తున్నారు. సావిత్రి రోజు కూలీ. అయితే, మెరిట్ ప్రాతిపదికన కన్వీనర్ కోటాలో బిటెక్ (మెకానికల్)లో సీటు సాధించిన సంజీవ ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్నాడు. ఐదు రోజుల క్రితం ఫైనలియర్ పరీక్షలు పూర్తయ్యాయి. మిత్రులందరూ ఇళ్లకు బయల్దేరుతున్నా, ఇతను మాత్రం ఒక రోజు హాస్టల్లోనే ఉండి ఇంటికెళతానని చెప్పి అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హోస్టల్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తర లించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంజీవ మొబైల్‌ను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయేమో అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతుని చేతులపై రక్తపు మరకలున్నాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తామని రూరల్ సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ సుకుమార్ తెలిపారు. -
ప్రేమ పేరుతో పెళ్లి: రెండు కిడ్నీలు పాడైపోయాయని...
‘ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. 14 ఏళ్లపాటు కలిసి ఉన్నాడు. ఇప్పుడు రెండు కిడ్నీలు పాడైపోయాయని పుట్టింట్లో వదిలేశాడు. ఆఖరు మజిలీలో భార్యగా అంగీకరిస్తే.. సుమంగళిగా వెళ్లాలని ఉంది’ అంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఎంబీఏ చదివిన ఓ యువతి ధర్నాకు దిగిన ఘటన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం చర్చనీయాంశమైంది. సాక్షి,మదనపల్లె టౌన్: తమిళనాడులోని మదురైకి చెందిన అంబురాజ్ 25 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. నీరుగట్టువారిపల్లె గజ్జిలకుంటలో తినుబండారాలు తయారు చేసి, దుకాణాలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన అక్క కూతురు నదియా ను 2001లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు దివ్యంగులున్నారు. ఇదిలావుండగా వ్యాపార అవసరాలకు అదే ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి యజమాని పెద్ద కూతురు బి.మేఘనను లొంగదీసుకున్నాడు. తరువాత ఉన్నత చదువుల పేరుతో ఇంటి నుంచి బయటకొచ్చిన మేఘన కు కురబలకోట మండలం, అంగళ్లులో ఓ దుకాణం పెట్టించిన అంబురాజ్ అప్పుడప్పుడూ ఆమె వద్దకు వెళ్లి వచ్చేవాడు. అంబురాజ్ ప్రేమ వ్యవహారం మొదటి భార్య నదియాకు తెలియడంతో ఆమె పలుమార్లు ఇద్దరినీ మందలించింది. ఈక్రమంలోనే మేఘనను అంబురాజ్ రిజిస్టర్ వివాహం చేసుకున్నాడు. 14 ఏళ్లు కలిసి ఉన్నా మేఘనకు పిల్లలు కలగలేదు. ఏడాది క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను పుట్టింట్లో వదిలేశాడు. మేఘనకు కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించగా వైద్యులు రెండు కిడ్నీలు పాడైపోయాయని తేల్చారు. తల్లిదండ్రులు మేఘనను ఇంట్లోనే పెట్టుకుని డయాలసిస్ చేయిస్తున్నారు. తన బిడ్డకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రు లు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబురాజ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తాను భర్త ఇంట్లోనే ఉండి, సుమంగళిగానే మరణిస్తానని మేఘన చెబుతోంది. పోలీసులు ఇరువర్గాలను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -
వారి టార్గెట్ యాత్రికులే.. మూడు పార్శిళ్లు ఆరు కర్రీలుగా దందా!
రద్దీ ప్రాంతాల్లోని బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో.. ఆకట్టుకునే రంగులతో మసాలాలు దట్టించిన ఆహారం.. నూనెల్లో వేయించిన పదార్థాలు.. చూస్తూనే నోరూరించేలా ఉండే కర్రీలు.. సర్వ సాధారణం. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, కల్తీ నూనెలు అత్యంత ప్రమాదకరమని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పలు ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో సేకరించిన శాంపిల్స్‌లో కేన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు తేలడంతో.. ఇవి తింటే రోగాలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి,చిత్తూరు: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ దందా.. రోజురోజుకూ శృతి మించుతుండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. చిత్తూరులోని పాతబస్టాండ్, హైరోడ్డు, కట్టమంచి, తిరుపతిలోని కొత్తబస్టాండ్, లీలామహాల్రోడ్డు, తుడారోడ్డు, పుత్తూరు బస్టాండ్ సమీపంలోని ప్రాంతాలు, మదనపల్లె, పలమనేరు, శ్రీకాళహస్తిలోని కొన్ని కూడళ్లలో జనం రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, మాంసాహార ఉత్పత్తులు అధికంగా విక్రయిస్తుంటారు. వీటిలో వినియోగించే పదార్థాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తించారు. జిల్లాలోని 75 హోటల్స్‌లో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి, ప్రమాదకరమని భావిస్తున్న 17 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 6 శాంపిల్స్ వినియోగానికి ఏమాత్రం తగవని తేలింది. అయినా ఈ కల్తీఫుడ్ దందా మాత్రం యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాత్రికులే టార్గెట్.. జిల్లాలో ఆలయాలు ఎక్కువగా ఉండడంతో నిత్యం లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, బోయకొండ, శ్రీకాళహస్తి వంటి రద్దీ ప్రాంతాల్లో ఫుడ్‌సెంటర్ల వ్యాపారం మూడు పార్శిళ్లు.. ఆరు కర్రీలు అన్న తరహాలో సాగుతోంది. దీనికితోడూ మాసం భోజన ప్రియులు గతంలో కంటే పెరగడంతో హోటల్స్, డాబా, ఫాస్ట్‌ఫుడ్, స్నాక్స్, బిర్యానీ దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. లైసెన్సులుండవు ఆహార పదార్థాలు తయారుచేసేవారు, నిల్వ చేసే వ్యాపారులు, రవాణా చేసే సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందాలి. ఆహార భద్రతా నియామావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి రూ.5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ ఉన్న హోటళ్లు: 73, రెస్టారెంట్లు–395, క్యాంటీన్లు–98, డాబా లేదా ఫుడ్ వెండింగ్స్–56 మాత్రమే లైసెన్సులు కలిగి ఉన్నాయంటే అతిశయోక్తికాదు. వీటికి రెట్టింపు సంఖ్యలో దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రధాన సమస్య ఇదే.. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు విక్రయింటే దుకాణాలు, బేకరీ, స్వీట్స్ తయారీలో ఎసెన్స్ సింథటిక్ రంగులు అధికంగా వినియోగిస్తుండడంతో కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీటికితోడు హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్‌ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. ఇవి వినియోగదారుల శరీరాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. -
నల్లారి వారి ‘భూ మాయ’.. అక్రమాలకు లెక్కేలేదు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో అధికారం దన్నుతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి భూదందాలకు లెక్కలేకుండా పోయింది. ఆయన అనుచరులు చెట్టు, పుట్ట, గుట్ట, వాగు, వంక, దేవుడిమాన్యం అనే తేడా లేకుండా ఏది కంటికి కనబడితే అది బినామీ పేర్లతో స్వాహా చేసేశారు. పీలేరు పట్టణంతో పాటు బోడుమల్లువారిపల్లె, ముడుపులవేముల, గూడరేవుపల్లె, యర్రగుంటపల్లె, దొడ్డిపల్లె, వేపులబైలు పంచాయతీలలో ప్రభుత్వ భూములు టీడీపీ నేతల పరమయ్యాయి. ► అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అసెంబ్లీలోనే నేరుగా పీలేరులో జరుగుతున్న భూదందా లను ప్రస్తావించారు. ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో అసెంబ్లీలో అధికారపక్షం సమాధానమిస్తూ కేవలం ఏడెకరాల భూమి మాత్రమే ఆక్రమణకు గురైందని స్పష్టం చేసింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తీసిన పక్కా లెక్కల్లో వందల ఎకరాల భూములు ఆక్రమణల చెర నుంచి బయటపడ్డాయి. వాటిల్లో కొన్ని భూములను పేదల ఇళ్లకు ప్రభుత్వం కేటాయించింది. అదే ఇప్పుడు టీడీడీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో నల్లారి బ్యాచ్ ఎదురుదాడికి దిగుతోంది. కానీ వాస్తవాలు ఇలా ఉన్నాయి. ► పీలేరు మండలం గూడరేవుపల్లె సర్వేనంబరు 198 లో 106.86 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమి గతంలో ఆక్రమణకు గురైంది. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆ భూమి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జగనన్న కాలనీలకు కేటాయించింది. ► పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీలో సర్వే నంబర్ 906లో 23ఎకరాలు, సర్వేనంబరు 908లో 10.14ఎకరాలు, 909/2లో 96సెంట్ల భూమి అన్యాక్రాంతమైంది. ప్రస్తుత ప్రభుత్వం వీటిల్లో కూడా చాలా వరకు ఆక్రమణలు తొలగించింది. ఇంకా ఇప్పటికీ నల్లారి అండ్ కో ఆదీనంలోనే.. ► పీలేరు మండలం దొడ్డిపల్లె, కాకులారంపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో గతంలో ఇందిరమ్మ గృహాల కోసం సుమారు 90ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 2,322 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అయితే 1,750మందికి మాత్రమే ఇచ్చి మిగిలిన 572 పట్టాలు, 6.80ఎకరాల భూమిని ఇప్పటికీ టీడీపీ నేతలు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అదేవిధంగా సర్వేనంబరు 1136/1లో 10.32ఎకరాల ప్రభుత్వ భూమి నల్లారి అనుచరుల ఆక్రమణలో ఉందని అక్కడ ఎవరినడిగినా చెబుతారు. ► పీలేరు పట్టణంలోని బోడుమల్లువారిపల్లి, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీల్లో అప్పట్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అండతో ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముకున్న సంగతి అందరికీ తెలిసిందే. ►అప్పట్లో అసైన్మెంట్ ఆమోదం లేకుండానే పీలేరు మండలంలో డీకేటీ పట్టాలను సొంతం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం డీకేటీ పట్టాలు జారీ చేస్తే అందుకు సంబంధించిన వివరాలను ఏ రిజిష్టరులో నమోదు చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా అడ్డగోలుగా డీకేటీ భూములు పంచేసుకున్నారు. ► అదే విధంగా అప్పట్లో కలికిరిలో సర్వే నంబర్ 547–ఎ, 549 –2ఎ పరిధిలో పంచాయతీ అనుమతులు లేకుండానే లే అవుట్లు వేసి విక్రయించి సొమ్ముచేసుకున్నారు. -
ప్రభుత్వ శాఖల్లో అద్దెకు సొంత వాహనాలు..
ఉన్నతమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం.. అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడుతున్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నా అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వాహన సౌకర్యాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. సొంత వాహనాలనే అద్దెకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పలుశాఖల్లో సాగుతున్న ‘అద్దె’ బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం. సాక్షి,చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి అద్దె వాహనాల దందా సాగుతోంది. ట్రెజరీ, రెవెన్యూ, ఎంపీడీఓలు, విద్యా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, హౌసింగ్, మున్సిపల్ అధికారులు.. ఇతర శాఖల్లో సొంత కార్లను వినియోగిస్తూ ప్రతి నెలా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పలు కార్యాలయాల ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రజాసేవ నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు అవసరమైతే వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లాస్థాయి అధికారి వాహనానికి నెలకు రూ.45వేలు, మండలస్థాయి అధికారి అయితే రూ.35వేలు అద్దె చెల్లిస్తోంది. నిరుద్యోగులకు బ్యాంకు రుణాలు, కార్పొరేషన్ల కింద సబ్సిడీపై ఓనర్ కమ్ డ్రైవర్స్కీం ప్రవేశపెట్టి ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి పలువురు ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు. తమ సొంత వాహనాలను వారు పనిచేస్తున్న శాఖలోనే అద్దెకు వినియోగిస్తున్నారు. మరికొందరు బినామీ పేర్లతో బిల్లులు పెట్టి అద్దెను జేబుల్లోకి వేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు! కొందరు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండానే నకిలీ బిల్లులు పెడుతున్నారు. తమకు కేటాయించిన వాహనంలో నెలకు 2,500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. అన్ని కిలోమీటర్లు తిరగకపోయినా నకిలీ బిల్లులు పెట్టి ప్రతి నెలా అద్దె పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఏళ్ల తరబడి గుట్టుగా దందా సాగిస్తున్నారు. ఉపాధికి గండి జిల్లా వ్యాప్తంగా దాదాపు 85 ప్రభుత్వ శాఖలున్నాయి. అందులో సగానికి పైగా శాఖల్లోని అధికారులు వైట్‌బోర్డు వాహనాలను వినియోగిస్తుండడం గమనార్హం. అదే ఎల్లోబోర్డు వాహనాలను అద్దెకు తీసుకుంటే పలువురికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని అద్దెకు పెడితే సంబంధిత బిల్లుల మంజూరుకు చుక్కలు చూపిస్తున్నారు. -
కడ చూపునకు వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు
సాక్షి, తిరుపతి: బంధువుల చావుకు వెళ్లి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి–చంద్రగిరి మార్గంలోని సి.మల్లవరం క్రాస్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎమ్మార్‌పల్లి ఇన్చార్జి సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు తిరుపతి దేవేంద్ర థియేటర్ సమీపంలోని శివాలయం వీధిలో జగన్నాథం(44), నాగజ్యోతి (32) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. జగన్నాథం చికెన్‌షాపులో పనిచేస్తున్నాడు. నెత్తకుప్పంలో బంధువు మృతి చెందడంతో కడ చూపునకు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా, సి.మల్లవరం క్రాస్ వద్ద తిరుపతి నుంచి చంద్రగిరి వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో 108 ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
చంద్రగిరిలో టీడీపీ ఇసుక దందా..
సాక్షి,చంద్రగిరి: మండలంలో టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచి అలవాటైన అక్రమ రవాణా నేటికీ కొనసాగుతోంది. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సొంత పంచాయతీ కందులవారిపల్లి కేంద్రంగా టీడీపీ మాఫియా ఏర్పాటైంది. శేషాపురానికి చెందిన టీడీపీ నాయకులు, నారావారిపల్లికి చెందిన చంద్రబాబు బంధువుతో కలసి, బుధవారం రాత్రి నుంచి బీమానదిలో ఇసుక తవ్వకం మొదలుపెట్టారు. రెండు జేసీబీలు, పది ట్రాక్టర్లను ఉపయోగించి కందులవారిపల్లి నుంచి పులిచెర్లకు ఇసుకను తరలిస్తున్నారు. మరికొన్ని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కొత్తపేటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. వాగులు, వంకల్లో ఇసుక ఖాళీ భీమా నది పరిసర ప్రాంతాల్లోని వంకలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను తోడేశారు. దీంతో సమీప బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటల సాగుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. అక్రమ రవాణాదారులపై ఫిర్యాదు చేస్తే దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతుండడం గమనార్హం. పట్టించుకోని యంత్రాంగం అక్రమ ఇసుక రవాణాపై సమాచారం ఉన్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్ఓ, వీఆర్ఏలతో పాటు గ్రామ పోలీసులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో కొందరు గుట్టుగా అక్రమ రవాణాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న డీఎస్పీ నరసప్ప బుధవారం రాత్రి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తవ్వుతున్న వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. అయితే డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ నిమిషాల వ్యవధిలో ఇసుక స్మగ్లర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన బీమానది నుంచి జేసీబీలు, ట్రాక్టర్లను మళ్లించేశారు. వారు వెళ్లిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ ఏమీ లేదంటూ చేతులు దులుపుకుని వెనుదిరగడం కొసమెరుపు. -
కబ్జాల పర్వం పరాకాష్టకు.. శ్మశానాన్నీ వదల్లేదు
సాక్షి,తిరుపతి: అమరరాజా ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, జల కాలుష్యంపై సదరు యాజమాన్యం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుతోంది. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అమరరాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం, ఇతర కాలుష్యం ప్రమాదకరంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తోపాటు హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా స్వయంగా ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా కంపెనీ తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసినప్పటికీ జిల్లాకు చెందిన కొంతమంది అధికారులు మాత్రం నిబంధనల మేరకు ఆయా ఫ్యాక్టరీల జోలికి వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. ఫ్యాక్టరీలకు వెళ్లడం మాట అటుంచి.. కనీసం సదరు ఫ్యాక్టరీల గురించి మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. అధికారుల మూగనోము దాదాపు ఎనిమిది ఎకరాల అటవీశాఖ భూములను కైంకర్యం చేసి ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి కలిపేసుకుని ప్రహరీ గోడ కట్టుకున్న వైనంపై ఫారెస్ట్ అధికారులు బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ అధికారిని అడిగితే పై అధికారిని అడగమని.. ఆయన్ని అడిగితే ఈయన్ని అడగమని ఇలా కనీస సమాచారం చెప్పేందుకు కూడా ప్రయాసపడ్డారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులు కూడా అదేమాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఫ్యాక్టరీ కాలుష్యంపై ఉన్నతాధికారులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కొంతమంది అధికారులు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్‌తో కాలుష్యపు శాతం ఎంత ఉందో విచారించేందుకు ప్రభుత్వం తరఫున ఈ నెల 3వ తేదీన వచ్చిన చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు పీసీబీ అధికారులను కంపెనీ యాజమాన్యం లోపలికి రానీయకుండా అడ్డుకుంటే... కేసు పెట్టేందుకు 16వ తేదీ వరకు పోలీసులను ఆశ్రయించడానికి ఆలోచించారంటేనే అసలు విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక పోలీసులూ తక్కువేం కాదు.. ప్రభుత్వ అధికారులను అడ్డుకుని విధులకు ఆటంకం కలిగిస్తే.. చాలా సీరియస్‌గా స్పందించి బలమైన కేసులు పెడతారు. కానీ సదరు ఫ్యాక్టరీ అధికారిపై మాత్రం కేవలం స్టేషన్ బెయిల్ వచ్చే కేసు పెట్టారంటేనే ఖాకీల సీరియస్‌నెస్ అర్థమవుతోంది. రెవెన్యూ అధికారులు కూడా ఇదే గాటన ఉన్నారనే చెప్పాలి. అక్కడి భూముల స్థితి, చెరువుల పరిస్థితి గురించి ఇన్నాళ్లూ కనీసం ఆరా తీయలేదంటేనే .. అటువైపు కన్నెత్తి చూడని నిర్వాకం బయటపడుతోంది. శ్మశానాన్నీ వదల్లేదు అమరరాజా ఫ్యాక్టరీ చుట్టుపక్కల చెరువులు, అటవీభూములు, స్థలాలు.. పొలాలు మింగేసిన అమరరాజా ఫ్యాక్టరీల యాజమాన్యం చివరికి శ్మశానాన్ని కూడా వదల్లేదు.. ఫ్యాక్టరీ గేటు ఎదురుగా ఉన్న రెండున్నర ఎకరాల శ్మశాన వాటిక భూములను కూడా కబ్జా చేసింది. కంపెనీ లారీల పార్కింగ్‌కు వాడుకుంటోంది. అమరరాజా కబ్జాల పర్వం పరాకాష్టకు ఇంతకు మించి చెప్పేదేముంది..? గళం విప్పుతున్న స్థానికులు అధికారులే సదరు కంపెనీ అన్యాయా లు, అక్రమాలపై చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటే.. ఇక అక్కడి సామాన్య ప్రజలు, ఆయా కంపెనీల్లో పనిచేసే కా ర్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘అంత పెద్దపెద్ద వాళ్లే ఏమీ మాట్లాడడం లేదు.. మనకెందుకొచ్చిన గొడవ’ అని చాలామంది ఫ్యాక్టరీ ప్రస్తావనే ఎత్తడం లేదు. ప్రాణాల మీదకు వస్తున్నా సరే.. ఉన్నంతకాలంగా అలానే ఉందాం.. అని రాజీపడే ధోరణే చాలామందిలో కనిపిస్తోంది. అయితే కొంతమంది గ్రామస్తులు మాత్రం ఇప్పుడిప్పుడే తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. తారకరామానగర్‌కు చెందిన కార్పెంట ర్ ప్రసాద్, పదో తరగతి చదువుతున్న పూజ, గతంలో కంపెనీలో పనిచేసి మానివేసిన కేఈ చలపతి, అక్కడే 13 ఏళ్లుగా నివసిస్తున్న మహిళ లోకేశ్వరీరెడ్డి .. ఇలా చాలామంది కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యంపై కొద్దిరోజులుగా గళం విప్పుతున్నారు. భూగర్భజలాల కాలుష్యం, విషవాయువులతో అంతుచిక్కని రోగాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.