
ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి
పుత్తూరు : ‘ చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది... వెన్నుపోటు పొడిచి ఆ మహానుభావుడి మరణానికి కారణమైన ఆయనే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరడాన్ని అభిమానులు, నిజమైన టీడీపీ వాదులు జీర్ణించుకోలేకున్నారు.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తారని విమర్శించారు. గురువారం పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు స్వార్థానికి ఇప్పటికీ ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటూనే ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్లతోనే ఆయనపై వైస్రాయ్ హోటల్ ఎదుట దాడి చేయించారని, అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎంతో సదుద్ధేశంతో అమలు చేసిన మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కారని. ఎన్టీఆర్ మానసిక పుత్రికైన రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయలు చేశారని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము కూడా మనస్ఫూర్తిగా కోరుకుం టున్నామని, ఈ అంశాన్ని ప్రస్తావించే అర్హత మాత్రం చంద్రబాబునాయుడుకు లేదని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment