కూలీపనుల కోసం మోటార్ సైకిల్పై వెళుతోన్నతండ్రీకుతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో మంగళవారం మంగళవారం ఈ ఘటన జరిగింది.
కూలీపనుల కోసం మోటార్ సైకిల్పై వెళుతోన్నతండ్రీకుతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో మంగళవారం మంగళవారం ఈ ఘటన జరిగింది.
సర్విరెడ్డి పల్లె గ్రామానికి చెందిన రఘునాథ్‌రెడ్డి(45), అతని కూతురు అరుణ(20)లు చిత్తూరుకు కూలీ పని కోసం బైక్‌పై బయలుదేరారు. కొద్దిసేపటికే ఎదురుగావస్తోన్న లారీ ఢీకొట్టింది. దీంతో రఘునాథ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, అరుణ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అరుణకు సొంతగ్రామానికే చెందిన చెంచురెడ్డితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. రఘునాథ్‌రెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టమార్టం కోసం మృతదేహాల్ని తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.