మృతిచెందిన పావని(ఫైల్), గాయపడిన రెడ్డిరాణి(ఫైల్)
మదనపల్లె క్రైం : కురబలకోట మండలం కంటేవారిపల్లె దగ్గరున్న కనిగలబావి ఈ నెల 6న వద్ద లారీ కారును ఢీకొన్న ప్రమాద విషయం తెలిసిందే. కదిరి వైపు నుంచి మదనపల్లెకు వస్తున్న లారీ ములకలచెరువు వైపు వెళుతున్న కారును ఢీకొనడంతో కారును నడుపుతున్న యజమాని అక్కడికక్కడే దుర్మరణం చెందడం, కారులో ఉన్న అతని భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడటం విదితమే. వారిని చికిత్స ని మిత్తం మదనపల్లె, బెంగళూరులకు తరలించగా మంగళవారం రాత్రి ఒక రు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాలిలా.. మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డు బాపూజి పార్కు ఎదురుగా ఉన్న గొల్లపల్లెకు చెందిన ఎస్.మోహన్(47)కు భార్య రెడ్డిరాణి(41), పావని(18) ఉన్నారు.
మోహ న్ స్థానికంగా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుండగా, ఇతని భార్య ములకలచెరువులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. భార్య జ్ఞానధార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా, మోహన్ ఆమెను తన కారులో తీసుకెళుతూ, ఇంట్లో ఒంటరిగా ఉంటుం దని కుమార్తెను కూడా వెంట తీసుకెళ్లాడు. ముగ్గురూ సంతోషంగా కారులో వెళుతుంటే దేవుడికి కన్నుకుట్టిందేమో..! క్షణాల్లో ఎదురుగా వచ్చిన లారీ మృత్యువై కారును ఢీకొంది. ఈ సంఘటనలో మోహన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆయన భార్య రెడ్డిరాణి, పావని తీవ్రంగా గాయపడ్డారు.
108 సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు రెడ్డిరాణిని తిరుపతికి, పావనిని బెంగళూరుకు రెఫర్ చేశారు. బెంగుళూరులో చికి త్స పొందుతూ పావని మంగళవారం రా త్రి మృతి చెందింది. వెన్నుపూస దెబ్బతినడంతో మాటలు కోల్పోవడమే కాకుండా, స్పర్శను కోల్పోయిన రెడ్డిరాణి మృత్యువుతో పోరాడుతోంది. అతివేగం తెచ్చిన అనర్థానికి ఓ కుటుంబం మొత్తం బలైంది. ఇంట్లో ఇద్దరు ఒకరి తరువాత ఒకరు చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంటికి వచ్చిన మృతదేహాలను చూడటానికి వచ్చిన బంధువుల కన్నీటిని తుడవడం ఎవరితరం కాలేదు.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
శాంతిపురం : నమ్ముకున్నవాడు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృత్యువుతో పోరాడుతూ బుధవారం మృతిచెందింది. మండలంలోని కడపల్లి పంచాయతీ శ్యామరాజపురానికి చెందిన మృతురాలి తల్లి పార్వతి ఫిర్యాదు మేరకు.. శ్యామరాజపురానికి చెందిన సుగుణ బంధువులతో పాటు బెంగళూరులో కూలి పనులకు వెళ్లేది. అదే గ్రామానికి చెందిన దేవేంద్ర ఆమెను ఇష్టపడి అక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 8న స్వగ్రామానికి బయలుదేరిన వీరు మార్గంమధ్యలోని కుప్పంలో గొడవపడ్డారు.
సుగుణను వదిలి దేవేంద్ర వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అదేరోజు కుప్పం పార్కులో విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు అపస్మారక స్థితిలోని ఆమెను స్థానిక ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సుగుణ బుధవారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం శ్యామరాజపురం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment