మృతిచెందిన నందిని
వారు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకుని పది రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఆదివారం కావడంతో సినిమా చూసేందుకు కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌లో బయలుదేరారు. వారి అన్యోన్యతను చూసి విధికి కన్నుకుట్టింది. ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు భార్యను కబళించింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లయిన పది రోజుల కే కుమార్తె మృతిచెందడంతో ఆ తల్లిదం డ్రులు చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు.
ఎర్రావారిపాళెం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం రాత్రి ట్రాక్టరును బైక్ ఢీకొంది. దీంతో భార్య మృతిచెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. స్థానిక పంచాయతీ మేదరపల్లెకు చెం దిన సోమశేఖర్(25), అతని భార్య నందిని(19), అదే గ్రామానికి చెందిన శివ(19) ద్విచక్ర వాహనంలో రొంపిచర్లలో సినిమా చూసేందుకు బయలుదేరారు.
అదే సమయంలో ట్రాక్టర్ రాతి కూశాలతో రొంపిచెర్ల మీదుగా ఎర్రావారిపాళెం వస్తోంది. ట్రాక్టర్ సింగిల్ లైటుతో వస్తోంది. దీన్ని గమనించని ద్విచక్ర వాహనదారులు ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. దీంతో భార్యాభర్తలు సోమశేఖర్, నందినికి తీవ్రంగా గాయపడ్డారు. శివకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థాని కులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని సోమశేఖర్, నందినిని తిరుపతి రుయాకు తరలించారు.
మార్గమధ్యంలో నందిని మృతి చెందింది. సోమశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. శివకు స్థానికంగా చికిత్సలు అందించారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గోపి తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ సింగిల్ లైట్ వేసుకుని వస్తుం డడంతో ద్విచక్ర వాహనంగా భావించి సోమ శేఖర్ ద్విచక్ర వాహనం ఢీకొన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. సోమశేఖర్ తిరుపతిలోని సాయిసుధ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment